ETV Bharat / state

హైదరాబాద్‌ నగరంలోని చెరువులపై పూర్తి పర్యవేక్షణ మాదే : హైకోర్టు

హైదరాబాద్​లోని చెరువుల పర్యవేక్షణపై హైకోర్టు - రామమ్మ చెరువు బఫర్​జోన్​లో నిర్మాణాల పిటిషన్​పై న్యాయస్థానంలో విచారణ

High Court Orders On Pond Buffer zone And FTL
High Court Orders On Pond Buffer zone And FTL (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

High Court Orders On Pond Buffer zone And FTL : హైదరాబాద్​లోని అన్ని చెరువులకు సంబంధించి పూర్తి పర్యవేక్షణ తమదేనని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. రామమ్మ చెరువు బఫర్‌జోన్‌లో ఎలాంటి నిర్మాణాలు జరగకుండా చూడాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై బుధవారం రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. హెచ్‌ఎండీఏ పరిధిలో 3 వేల 532 చెరువులు ఉన్నాయని జులైలో జరిగిన విచారణ సందర్భంగా ప్రభుత్వం తెలపగా వాటన్నింటికీ బఫర్‌జోన్‌, ఎఫ్‌టీఎల్​ను నిర్ధరించాలని హైకోర్టు ఆదేశించింది.

తదుపరి విచారణ డిసెంబర్ 30కి వాయిదా : ఇవాళ విచారణకు హాజరైన హెచ్ఎండీఏ కమిషనర్ ఇప్పటివరకు 2,793 చెరువులకు ప్రాథమిక నోటిఫికేషన్లు జారీ చేసినట్లుగా తెలిపారు. 530 చెరువులకు సంబంధించి తుది నోటిఫికేషన్లు పూర్తయినట్లుగా వెల్లడించారు. హైదరాబాద్‌ పరిధిలోని అన్ని చెరువులకు ఎఫ్‌టీఎల్‌(ఫుల్ ట్యాంక్ లెవల్), బఫర్‌ జోన్లను నిర్ధరిస్తూ తుది నోటిఫికేషన్‌ జారీకి 3 మాసాల సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టును కోరగా అందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. తదుపరి విచారణను డిసెంబరు 30వ తేదీకి వాయిదా వేసింది.

ఎఫ్​టీఎల్​, బఫర్​ జోన్​లోని అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలు తొలగించాల్సిందే : హైకోర్టు

హైడ్రా జీవో 99 చట్టబద్ధతను సవాల్ చేస్తూ పిటిషన్ - మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమన్న హైకోర్టు - TELANAGANA HIGH COURT ON HYDRA

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.