ETV Bharat / offbeat

సూపర్ టేస్టీ "సగ్గుబియ్యం దోశలు" - నిమిషాల్లో చేసుకోండిలా! - అందరికీ చాలా చాలా నచ్చేస్తుంది!

ఎప్పుడూ ఆనియన్, మసాలా, ఎగ్ దోశ తిని బోరింగ్​గా అనిపిస్తోందా? - ఓసారి సగ్గుబియ్యం దోశను ట్రై చేయండి!

How to Make Sabudana Dosa
Sabudana Dosa Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 3 hours ago

Sabudana Dosa Recipe in Telugu : ఎక్కువ మంది ఫెవరేట్ బ్రేక్​ఫాస్ట్​ రెసిపీలలో ఒకటి దోశ. అయితే, మినప్పిండి, బియ్యప్పిండి దోశలు సాధారణం. ఎప్పుడూ అదే అంటే విసుగొస్తుందనిపిస్తే రవ్వ దోశ, టమాటా దోశ, ఎగ్ దోశ.. అంటూ మరికొన్ని రకాలు ట్రై చేస్తుంటాం. ఇవి మాత్రమే కాదు.. సగ్గు బియ్యంతో కూడా క్రిస్పీగా, టేస్టీగా దోశలు వేసుకోవచ్చు. పైగా ఇందుకోసం ముందురోజే పిండి రుబ్బి పులియబెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. చాలా సింపుల్​గా అప్పటికప్పుడు ఈ సగ్గు బియ్యం దోశలు ప్రిపేర్ చేసుకోవచ్చు. రుచి కూడా చాలా బాగుంటాయి! మరి, ఈ సూపర్ టేస్టీ దోశలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అందుకు కావాల్సిన పదార్థాలేంటి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • బియ్యం - 1 కప్పు
  • సగ్గబియ్యం - 1 కప్పు
  • పెరుగు - పావు కప్పు
  • నూనె - తగినంత
  • అల్లం - అంగుళం ముక్క
  • పచ్చిమిర్చి - 4
  • ఉల్లిపాయ - 1
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
  • ఉప్పు - రుచికి సరిపడా
  • కరివేపాకు - 2 రెమ్మలు(సన్నగా తరుక్కోవాలి)

నిమిషాల్లో ప్రిపేర్​ అయ్యే "రాగి దోశ విత్ టమాట చట్నీ"- టేస్ట్​ అదుర్స్​ - ఓసారి ట్రై చేయండి!

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా వేర్వేరు బౌల్స్​లో బియ్యం, సగ్గుబియ్యాన్ని విడివిడిగా రెండు గంటలపాటు నానబెట్టుకోవాలి.
  • అలాగే రెసిపీలోకి కావాల్సిన ఉల్లిపాయ, పచ్చిమిర్చిని సన్నగా తరుక్కొని పక్కన ఉంచుకోవాలి.
  • ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు గంటలపాటు నానబెట్టుకున్న బియ్యం, సగ్గుబియ్యాన్ని తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
  • తర్వాత దాన్ని ఒక మిక్సింగ్ బౌల్​లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి.
  • అనంతరం మరో మిక్సీ జార్​లో సన్నగా తరుకున్న అల్లం, పచ్చిమిర్చి వేసి మెత్తని పేస్ట్​లా గ్రైండ్ చేసుకోవాలి.
  • ఇప్పుడు మిక్సింగ్​ బౌల్​లోకి తీసుకున్న సగ్గుబియ్యం పిండిలో పచ్చిమిర్చి పేస్ట్​ని వేసుకొని మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి.
  • ఆ తర్వాత అందులో పెరుగు, సన్నగా తరుకున్న కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ తరుగు, ఉప్పు వేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ పిండి గట్టిగా ఉందనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. అయితే, పిండి మరీ పలుచగా, మరీ చిక్కగా కాకుండా మీడియంగా ఉండేలా చూసుకోవాలి.
  • అనంతరం స్టౌపై దోశ పెనం పెట్టుకొని వేడి చేసుకోవాలి. పాన్ వేడయ్యాక కొద్దిగా పిండిని తీసుకొని దోశ మాదిరిగా వేసుకోవాలి. అయితే, ఈ పిండిని నార్మల్ దోశ చేసుకున్నట్లు గట్టిగా రుద్దకూడదని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇవి కాస్త మందంగానే ఉంటాయి.
  • దోశ కొద్దిగా కాలాక అంచుల వెంబడి కాస్త ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆపై మీడియం ఫ్లేమ్ మీద రెండు వైపులా ఎర్రగా కాల్చుకుని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే "సగ్గుబియ్యం దోశలు" రెడీ!
  • ఇక వీటిని పల్లీ లేదా కొబ్బరి చట్నీతో వేడివేడిగా తింటే సూపర్ టేస్టీగా ఉంటాయి! నచ్చితే మీరూ ఓసారి ట్రై చేయండి. ఇంటిల్లిపాదీ ఎంతో ఇష్టంగా తింటారు!

ఇంటిల్లిపాదికీ నచ్చే "సేమియా దోశ" - చిటికెలో ప్రిపేర్ చేసుకోండిలా! - టేస్ట్ అదుర్స్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.