ETV Bharat / offbeat

జొన్నలతో రొట్టెలు, దోశలే కాదు - ఇలా "ఉప్మా"ను ప్రిపేర్ చేసుకోండి! - ఆరోగ్యానికి ఎంతో మేలు! - JOWAR UPMA RECIPE

హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్​ఫాస్ట్ రెసిపీ - నోరూరించే "జొన్న ఉప్మా" ప్రిపేర్ చేసుకోండిలా!

JONNA UPMA RECIPE
Jowar Upma Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 28, 2024, 7:31 AM IST

Jowar Upma Recipe in Telugu : ప్రస్తుత రోజుల్లో ఎక్కువ మంది ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా తమ డైలీ డైట్​లో జొన్నలను భాగం చేసుకుంటున్నారు. ముఖ్యంగా చాలా మంది జొన్నలతో రొట్టెలు, దోశలు ప్రిపేర్ చేసుకుంటుంటారు. అయితే, ఎప్పుడూ అవేకాకుండా ఈసారి కాస్త స్పెషల్​గా "జొన్న ఉప్మాను" ట్రై చేయండి. టేస్ట్​ సూపర్​గా ఉంటుంది. ఉప్మా అంటే ఇష్టపడనివారు దీన్ని చాలా ఇష్టంగా తింటారు. ఆరోగ్యానికీ ఎంతో మేలు జరుగుతుంది. పైగా ఎవరైనా ఈ రెసిపీని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి, ఈ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • జొన్నలు - 1 కప్పు
  • నూనె - ఒకటిన్నర టేబుల్​స్పూన్లు
  • శనగపప్పు - 1 టీస్పూన్
  • మినప్పప్పు - 1 టీస్పూన్
  • ఆవాలు - 1 టీస్పూన్
  • జీలకర్ర - 1 టీస్పూన్
  • వేయించుకున్న పల్లీలు - 2 టేబుల్​స్పూన్లు
  • ఎండుమిర్చి - 4
  • ఇంగువ - చిటికెడు
  • ఉల్లిపాయ - 1
  • పచ్చిమిర్చి - 3
  • బీన్స్ తరుగు - అర కప్పు
  • క్యారెట్ - 1
  • ఉడకబెట్టిన పచ్చి బఠాణీ - పాపు కప్పు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • పసుపు - పావుటీస్పూన్
  • కరివేపాకు - కొద్దిగా
  • పచ్చికొబ్బరి తురుము - కొద్దిగా

బరువు, షుగర్​ను కొట్టే ఫుడ్​ ఇదే - "జొన్న దోశలు" ఇలా తయారు చేసుకోండి - టేస్ట్​ వేరే లెవల్​!

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా జొన్నలను శుభ్రంగా కడిగి ఒక బౌల్​లో 10 గంటలపాటు నానబెట్టుకోవాలి. అంటే.. మార్నింగ్​ బ్రేక్​ఫాస్ట్​గా చేసుకోవాలనుకునేవారు రాత్రిపూట నానబెట్టుకుంటే సరిపోతుంది.
  • ఇప్పుడు 10 గంటల పాటు నానబెట్టుకున్న జొన్నలను మరోసారి శుభ్రంగా కడిగి వాటర్ వడకట్టుకోవాలి.
  • అనంతరం స్టౌపై కుక్కర్ పెట్టుకొని నానబెట్టుకున్న జొన్నలు వేసి తగినన్ని వాటర్ పోసుకోవాలి. ఆపై మూతపెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఆరు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి.
  • ఆవిధంగా ఉడికించుకున్నాక కుక్కర్ ఆవిరి మొత్తం తొలగించుకొని మూత తీసి ఉడికిన జొన్నలను స్టెయినర్​లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం ద్వారా అదనపు నీరు ఉంటే తొలగిపోతుంది.
  • జొన్నలు ఉడికేలోపు రెసిపీలోకి కావాల్సిన ఉల్లిపాయను సన్నని చీలికలుగా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, క్యారెట్, బీన్స్​ను సన్నని ముక్కలుగా తరుక్కొని పక్కన ఉంచుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడెక్కాక శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని దోరగా వేయించుకోవాలి.
  • అవి వేగాక వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు, ఇంగువ, సన్నని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్, బీన్స్ తరుగు వేసుకొని కలిపి ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి.
  • ఆ తర్వాత ఉడికించిన పచ్చి బఠాణీ, ఉప్పు, పసుపు, కరివేపాకు యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆపై ఉడికించి పక్కన పెట్టుకున్న జొన్నలు వేసి మరోసారి బాగా మిక్స్ చేసుకొని మరో ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
  • అనంతరం అరచెక్క నిమ్మరసం పిండి, కొబ్బరి తురుము, కొత్తిమీర తురుము వేసుకొని మిశ్రమం మొత్తం కలిసేలా చక్కగా కలిపి సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే "జొన్న ఉప్మా" రెడీ!
  • దీన్ని నేరుగా, లేదంటే ఏదైనా పచ్చడితో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. మరి, ఇంకెందుకు ఆలస్యం నచ్చితే మీరూ ఓసారి ట్రై చేయండి!

బరువు తగ్గించే "జొన్న గుమ్మడికాయ సూప్" - ప్రిపరేషన్ చాలా ఈజీ! - బీపీ, షుగర్​కూ చక్కటి మెడిసిన్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.