DILAWARPUR VILLAGERS PROTEST END : తీవ్ర ఉద్రిక్తతలు అరెస్టులు రాళ్లు రువ్వటం, భయంతో పోలీసులు పరుగుతీయటం ఆందోళనతో దద్దరిళ్లిన 61 నంబర్ జాతీయ రహదారి వెరసి రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన నిర్మల్ జిల్లా దిలావర్పూర్-గుండంపెల్లి గ్రామాల మధ్య ఏర్పాటు చేయనున్న ఇథనాల్ పరిశ్రమను రద్దుకో సం బాధిత ప్రజలు చేస్తున్న పోరాటం బుధవారం రాత్రి ఫలప్రదమైంది.
నిర్మల్ జిల్లా దిలవార్ పూర్ మండలంలో నిర్మిస్తున్న ఇథనాల్ పరిశ్రమ రద్దుకు రాజకీయాలకు తావీయకుండా రెండు రోజులుగా జరిగిన ఆందోళనకు మహిళలే ముందు నిలిచారు. పిల్లా, పాపలతో కలిసి ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటలవరకు చావో, రేవో అన్నట్లు పురుగుమందు డబ్బాలతో రోడ్డుమీద బైఠాయించి నిరసనలో పాల్గొన్నారు. వంటవార్పు చేశారు. అంతకుముందు దిలావర్పూర్ గుండంపెల్లి గ్రామశివారులో భారీగా మోహరించిన పోలీసు బలగాల మధ్య కొంతమంది పోలీసులు ముందస్తు అరెస్టు చేయటం తీవ్ర ఉద్రిక్తలకు దారితీసింది.
విషయం తెలిసి భారీ సంఖ్యలో మహిళలు దిలావర్పూర్ పోలీసు స్టేషన్ ముందు, ఆతర్వాత నిర్మల్-బైంసా 61 జాతీయ రహదారిపై బైఠాయించటానికి బయలుదేరగా పోలీసులు అడ్డుకునేందుకు యత్నించారు. ప్రతిఘటించే క్రమంలో ఓ దశలో ఆందోళనకారులు రాళ్లు రువ్వగా పోలీసులు భయంతో పరుగుతీశారు. నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీహరిరావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు..
రైతులతో కలెక్టర్ , ఎస్పీ చర్చలు : రాష్ట్ర ప్రభుత్వం తరపున నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిళ బుధవారం చర్చలకు ఆహ్వానించటం ప్రజల్లో అనందం వ్యక్తమైంది. నిర్మల్ కలెక్టరేట్లో అధికారులు, రైతుల మధ్య గంటన్నరపాటు మూడు ప్రధాన డిమాండ్లపై చర్చ జరిగింది. ఒకటి భేషరతుగా ఇథనాల్ పరిశ్రమను రద్దు చేయాలి. రెండోది ఏడాదిన్నర కాలంగా వివిధ కారణాలతో రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయటం, మూడోది ఆందోళనకు మద్దతు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగులపై విధించిన సస్పెన్షన్లను వెనక్తి తీసుకోవాలని రైతులు డిమాండ్ చేయగా అధికారుల నుంచి సానుకూలత వచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం పరిశ్రమ దగ్గర పనులను ఆపివేయించాలని పేర్కొన్న రైతలు ఒకవేళ ప్రభుత్వం మాటతప్పితే మళ్లీ ఉద్యమం చేయటానికి వెకకాడబోమని స్పష్టం చేశారు.
పరిశ్రమ దగ్గర జరిగే పనులను ఆపివేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీచేయటంతో రైతులు ఆందోళనను విరమించినట్లు కలెక్టరేట్లో అంగీకారం కుదరింది . అనంతరం రైతు ప్రతినిధులు దిలావర్పూర్ వద్ద జాతీయ రహదారిపై బైరాయించిన ఆందోళనకారుల వద్దకు వచ్చారు. అధికారులతో జరిగిన చర్చలు సారాంశం వివరించి ఆందోళనను విరమించారు. టపాసులు పేల్చి ఆనందం పంచుకున్నారు. ఎస్పీ జానకి షర్మిల దిలావర్పూర్ వచ్చి మహిళలతో ఆనందం పంచుకున్నారు. రాష్ట్రమంత్రి సీతక్కతో ఫోన్లో మట్లాడించారు. కేసులు ఎత్తివేత విషయంలోనూ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.
పిల్లలు, పెద్దలు ఏకమయ్యారు - ఇథనాల్ పరిశ్రమ వద్దంటూ ధర్నాకు దిగారు