2 Kachidi Fish Cost 4 Lakh Rupees in Andhra Pradesh : జాలర్లకు ఒక్కోసారి ఎంత కష్టపడినా తగిన ప్రతిఫలం దక్కదు.. ఒక్కోసారి ఊహించని విధంగా అద్భుతం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణాజిల్లా మత్స్యకారుల విషయంలో ఇలాంటి అద్భుతమే తాజాగా జరిగింది. అవును మరి.. ఒక్క చేప మహా అయితే వందలు.. ఇంకా ఎక్కువైతే వేల రూపాయలు ఉంటుంది. కానీ.. ఇక్కడ మనం చూస్తున్న చేప మాత్రం అక్షరాలా లక్ష రూపాయలు పలికింది!
సహజంగా పులస చేపలు ఎక్కువగా ధర పలుకుతాయని అందరికీ తెలుసు. వాటికి ఉండే ప్రత్యేకమైన రుచి.. మాంసాహార ప్రియులను అంతగా ఆకర్షిస్తుంది. అందుకే.. వేల రూపాయలు ఖర్చు చేసి మరీ వాటిని కొనుగోలు చేస్తారు. కానీ.. ఈ చేపలు వేరే. వీటిని కచ్చిడీ చేపలు అంటారు. వీటికి ఎవ్వరూ ఊహించని రీతిలో ధర పలికింది. ఈ రెండు చేపలకు ఏకంగా 2 లక్షల రూపాయలు చెల్లించి కొనుగోలు చేశాడో వ్యక్తి.
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో..
అంతర్వేది సముద్ర తీరంలో చేపలు పడుతున్న మత్స్యకారులకు ఈ రెండు కచ్చిడీ చేపలు చిక్కాయి. సముద్రం నుంచి వీటిని బయటకు తెచ్చిన జాలరులు.. వాటిని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అంతర్వేదిపల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్ లో శనివారం వేలం వేశారు. ఈ వేలంలో ఈ రెండు చేపలను దక్కించుకునేందుకు చాలా మంది పోటీపడ్డారు. వారంతా సాధారణ జనం కాదు.. అందరూ వ్యాపారులే. మరి ఇంతగా పోటీ పడి కొనుగోలు చేయడానికి కారణం ఏమంటారా? స్పెషల్ రీజనే ఉంది!