19 Year Old Dies By Suicide Case In Hyderabad :హైదరాబాద్లోనిబేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 11న డిగ్రీ విద్యార్థిని స్రవంతి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన కేసును పోలీసులు ఛేదించారు. సొంత అన్న భార్య (వదిన) శైలజ వేధింపుల వల్లే బలవన్మరణానికి పాల్పడిందని నిర్ధారించారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం : రసూల్‌పురా ఇందిరమ్మ నగర్‌కు చెందిన విఠల్ కుమార్తె స్రవంతి (19) ఈ నెల 11వ తేదీన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పొరుగున ఉండే ఓ యువకుడి వేధింపులతోనే కుమార్తె ఆత్మహత్య చేసుకుందని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు, స్రవంతి మొబైల్లోని సందేశాల ద్వారా యూసుఫ్‌గూడ రహమత్‌నగర్‌లో ఉంటున్న నవీన్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలోనే ఎవరూ ఊహించని ట్విస్ట్ వెలుగు చూసింది.
పెళ్లికి ముందే సంబంధం : స్రవంతి వదిన శైలజకు నవీన్ కుమార్‌తో పెళ్లికి ముందే సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతను ఇటీవల మళ్లీ శైలజను కలవడం ప్రారంభించాడు. ఈ విషయాన్ని స్రవంతి కనిపెట్టింది. ఈ విషయం ఎక్కడ బయట పడుతుందోనని భావించిన వదిన, స్రవంతికి ఇంటి పక్కనే ఉండే ఓ యువకుడితో సంబంధం ఉందంటూ వేధించడం ప్రారంభించింది. అతను తనకు సోదరుడి వంటివాడని చెప్పినా, వినిపించుకోకుండా వేధింపులు కొనసాగించింది.