తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రి థర్మల్‌ పవర్ ప్లాంట్​లో రూ.కోట్ల విలువైన సామగ్రి చోరీ - ఇంటి దొంగలను పట్టుకున్న నల్గొండ పోలీసులు - YTPS Plant  Thieves Arrested - YTPS PLANT  THIEVES ARRESTED

YTPS Plant Thieves Arrested: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూ.వేల కోట్ల వ్యయంతో నిర్మాణం చేపట్టిన ప్రాజెక్టు అది. అలాంటి ప్రాజెక్టులో అక్కడ పని చేసే వారే తమ చేతివాటాన్ని చూపారు. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడనే సామెతను నిజం చేశారు. ఏడాదిన్నరగా రూ.కోట్ల విలువైన సామగ్రిని దొంగలిస్తున్నా ఎవరూ గుర్తించలేకపోయారు. నల్గొండ జిల్లా పోలీసులు మాత్రం చాకచక్యంగా దొంగల ముఠాను పట్టుకున్నారు.

YTPS Plant Thieves Arrested
People Arrested For Stealing in YTPS (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 1, 2024, 9:57 AM IST

YTPS Plant Thieves Arrested (ETV Bharat)

11 People Arrested For Stealing in YTPS : నల్గొండ జిల్లా దామరచర్ల ప్రాంతంలోని వైటీపీఎస్‌లో పథకం ప్రకారం అల్యూమినియం, జీఐ వైరు డీసీఎంలలో తరలించి అమ్మకాలు చేస్తున్న 11 మందిని అరెస్టు చేసినట్లు ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. అరెస్ట్‌ చేసిన వారి నుంచి రూ.58 లక్షల నగదు, రూ.20 లక్షల విలువ చేసే కారు, రెండు ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో కలిపి మొత్తం రూ.1.49 కోట్లు విలువ చేసే సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

డీసీఎంలలో తరలించి అమ్మకాలు :నల్గొండ జిల్లా దామరచర్లలోని యాదాద్రి థర్మల్‌ పవర్ ప్లాంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మాణం చేపట్టింది. సుమారు 30 వేల ఎకరాల్లో ఉన్న ప్రాజెక్టులో నిర్మాణానికి సంబంధించిన పరికరాలను నిల్వ ఉంచారు. వాటిపై కన్నేసిన కొందరు వ్యక్తులు, ప్రాజెక్టులో పని చేస్తున్న సూపర్‌వైజర్లు, సెక్యూరిటీ గార్డు, క్రేన్ ఆపరేటర్లతో పరిచయం పెంచుకున్నారు.

JCBతో వచ్చి ఏటీఎం చోరీకి యత్నం.. సడెన్​గా పోలీసుల ఎంట్రీ​.. చివరకు..

YTPS Plant Thieves Arrested: ప్రతిరోజు డీసీఎం లోపలికి వెళ్లడం, అందులో జీఐ కట్టలు, అల్యూమినియం షీట్లు వేసుకోవడం అనుమానం రాకుండా బయటకు వెళ్లడం చేస్తున్నారు. గత ఏడాదిన్నరగా ఇదే తంతు నడుస్తుంది. నిర్మాణ సంస్థ వాళ్లు సామగ్రి మాయం అవుతుందని వాడపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిఘా పెట్టిన పోలీసులు 11 మంది నిందితులను అరెస్టు చేశారు. ఇంకా దీనిపై విచారణ కొనసాగుతుందని వారు వెల్లడించారు. నిర్మాణ సంస్థలు వాడపల్లి పీఎస్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసి నిందుతులను అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు.

ఈ కేసులో సెక్యూరిటీ గార్డు, ముగ్గురు క్రేన్ ఆపరేటర్లను అదుపులోకి తీసుకున్నామని చందన దీప్తి వెల్లడించారు. ఇప్పటికే పెద్ద మొత్తంలో చోరీ జరిగిందని, దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరుగుతందన్నారు. నిందితుల్లో ఇద్దరిపై రౌడీ షీట్లు ఉన్నాయని, వాటితో పాటు నేర చరిత్ర కూడా ఉందా? అని పరిశీలిస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ కేసు ఛేదించిన మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్‌ రాజు, రూరల్‌ సీఐ వీరబాబు, వాడపల్లి ఎస్సై రవి, వేములపల్లి ఎస్సై విజయ్‌ కుమార్, మాడుగులపల్లి ఎస్సై శోభన్‌ బాబు, సీసీఎస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ విష్ణువర్ధన్‌గిరిలను ఎస్పీ అభినందించారు.

ఇల్లందులో ముసుగు దొంగ హల్​చల్ - సీసీకెమెరాలో రికార్డయిన దృశ్యాలు - వీడియో వైరల్​ - Masked Thief Hal Chal in Khammam

దొంగలను ఎదుర్కొన్న తల్లీకుమార్తెలు - వెల్లువెత్తుతున్న ప్రశంసలు - WOMEN INTERVIEW WHO FACED THIEVES

ABOUT THE AUTHOR

...view details