Zimbabwe vs India first T20 :టీ20 ప్రపంచకప్ 2024 సాధించిన టీమ్ ఇండియాకు జింబాబ్వే షాక్ ఇచ్చింది. విజయోత్సాహాల నుంచి ఇంకా బయటపడక ముందే ఓటమి రుచి చూపించింది. 5 టీ20 సిరీస్‌లో భాగంగా ఆడిన తొలి మ్యాచ్‌లో టీమ్ఇండియా ఓడిపోయింది. 116 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 19.5 ఓవర్లలో 102 పరుగులకు ఆలౌటయ్యింది. 13 పరుగులు తేడాతో ఓడిపోయింది.
లక్ష్య ఛేదనలో టీమ్ఇండియాకు ప్రారంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. మొదటి ఓవర్లోనే బ్రియాన్ బెన్నెట్ బౌలింగ్‌లో అభిషేక్ శర్మ (0) వెనుదిరిగాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ( 29 బంతుల్లో 31; 5×4) టాప్ స్కోర్‌గా నిలిచాడు. అతడు తొలి డౌన్‌లో వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ (7)తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించేందుకు ట్రై చేశాడు. కానీ ముజరబాని బౌలింగ్‌లో షాట్‌కు ప్రయత్నించి గైక్వాడ్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రియాన్ పరాగ్ (2), రింకూ సింగ్ (0), ధ్రువ్ జురెల్ (7) వరుసగా ఫెయిల్ అయ్యారు. అనంతరంగిల్‌ను సికిందర్ బౌల్డ్ చేశాడు. చివర్లో వచ్చిన రవి బిష్ణయ్ (9), అవేశ్ ఖాన్ (12 బంతుల్లో 16; 3×4) వాషింగ్టన్ సుందర్ ( 34 బంతుల్లో 27;1×4, 1×6) పోరాడినా ఫలితం దక్కలేదు. చటార (3/16), సికిందర్ రజా (3/25) భారత్‌ను గట్టిగానే దెబ్బకొట్టారు. బెన్నెట్, మసకద్జా, జాంగ్వి, ముజరబాని తలో వికెట్ దక్కించుకున్నారు.