తెలంగాణ

telangana

ETV Bharat / sports

అప్పుడు రూ.20 లక్షలే- ఇప్పుడు ఈ కుర్రాళ్లు కోటీశ్వరులు- లిస్ట్​లో తెలుగోడు కూడా! - 2025 IPL RETENTIONS

రిటెన్షన్స్​లో సత్తా చాటిన కుర్రాళ్లు- రూ.20 లక్షల నుంచి రూ. కోట్లలో శాలరీ- లిస్ట్​లో తెలుగు కుర్రాడు

2025 IPL Retentions
2025 IPL Retentions (Source: Getty Images)

By ETV Bharat Sports Team

Published : Nov 1, 2024, 1:58 PM IST

Young Players 2025 IPL Retentions :2025 ఐపీఎల్​ రిటెన్షన్స్​లో యువ క్రికెటర్లు సత్తా చాటారు. దాదాపు అన్ని ఫ్రాంచైజీలు సీనియర్ల కంటే ఎక్కువగా కుర్రాళ్లకే ప్రాధాన్యం ఇచ్చాయి. గతంలో కొనుగోలు చేసిన ధర కంటే ఎక్కువగా హైక్ ఇచ్చి మరీ యంగ్ ప్లేయర్లను భారీ ధరకు అట్టిపెట్టుకున్నాయి. దీంతో గతంలో బెస్​ప్రైజ్​కు అమ్ముడైన ఆటగాళ్లు సైతం ఈసారి రిటెన్షన్స్​లో కోట్లు దక్కించుకున్నారు. మరి ఈ జాబితాలో ఉన్న ప్లేయర్లు ఎవరో చూద్దాం

  1. ధ్రువ్ జురెల్ : 2023 ఐపీఎల్​లో రాజస్థాన్​ రాయల్స్ వికెట్ కీపర్, బ్యాటర్ ధ్రువ్ జురెల్​ను బెస్​ప్రైజ్​ రూ.20 లక్షలకు దక్కించుకుంది. అయితే కీపింగ్​ స్కిల్స్​ ఉండడం వల్ల రాజస్థాన్ ఈసారి అతడిని అట్టిపెట్టుకుంది. రిటెన్షన్స్​లో జురెల్ ఏకంగా రూ. 14కోట్లు దక్కించుకున్నాడు.
  2. మయాంక్ యాదవ్ : పేస్ గన్​ మయాంక్ యాదవ్​ను గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ అట్టిపెట్టుకుంది. 2023లో అతడి శాలరీ రూ. 20లక్షలు కాగా, ఇప్పుడు రూ.11 కోట్లు అందుకోనున్నాడు.
  3. రజాత్ పటిదార్ : 2021 ఐపీఎల్​లో ఆర్సీబీ పటిదార్​ను రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. కాగా, తాజా రిటెన్షన్స్​లో రూ.11 కోట్లకు అట్టిపెట్టికుంది.
  4. రింకూ సింగ్ : సిక్సర్ కింగ్ రింకూ సింగ్​ను 2022 మెగా వేలం సందర్భంగా కేకేఆర్ రూ. 55 లక్షలకు దక్కించుకుంది. అయితే ఈసారి రింకూ శాలరీ భారీగా పెరిగిపోయింది. 2025 సీజన్​కు గాను రింకూ రూ.13కోట్ల శాలరీ తీసుకోనున్నాడు.
  5. ట్రిస్టన్ స్టబ్స్ : ధనాధన్ ఇన్నింగ్స్​తో ఆకట్టుకునే స్టబ్స్​ కూడా ఈసారి మంచి ధర దక్కించుకున్నాడు. అతడిని గతేడాది దిల్లీ క్యాపిటల్స్ రూ.55 లక్షలకు కొనుగోలు చేయగా, ఈసారి రూ.10 కోట్లు ఇవ్వనుంది.
  6. సాయి సుదర్శన్ : 2022 వేలంలో యంగ్ బ్యాటర్ సాయి సుదర్శన్​ను గుజరాత్ టైటాన్స్ రూ. 20 లక్షల బేస్​ప్రైజ్​ కు దక్కించుకుంది. మూడు సీజన్లుగా నిలకడగా రాణిస్తున్న సుదర్శన్​ను గుజరాత్ అట్టిపెట్టుకుంది. అతడు రిటెన్షన్స్​లో రూ.8.5 కోట్లు దక్కించుకున్నాడు.
  7. నితిశ్ కుమార్ రెడ్డి : తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డిని సన్​రైజర్స్ 2023లో రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. గతేడాది అద్భుతంగా రాణించిన నితీశ్​ను సన్​రైజర్స్ వదులుకోడానికి ఇష్టపడలేదు. దీంతో ఈసారి నితీశ్​కు రూ. 6కోట్లు ఇచ్చి మరీ అట్టిపెట్టుకుంది
  8. శశాంక్ సింగ్ : 2024 మినీ వేలంలో పంజాబ్ కింగ్స్ శశాంక్ సింగ్​ను రూ.20 లక్షలకు తీసుకుంది. అయితే వేలంలో పంజాబ్ కాస్త తికమకకు గురై ఇంకొకరికి బదులుగా ఈ శశాంక్ సింగ్​ను కొనుగోలు చేసిందని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈసారి అదే శశాంక్ సింగ్​ను పంజాబ్ రిటైన్ చేసుకుంది. ఈసారి శశాంక్ రూ.5.5 కోట్లు శాలరీ అందుకోనున్నాడు.

ఈ లిస్ట్​లో దాదాపు అందరు ప్లేయర్లు గతంలో బేస్​ప్రైజ్​కు అమ్ముడైన వాళ్లే. గడిచిన రెండు, మూడు సీజన్లలో తమతమ ప్రదర్శనతో సత్తా చాటడం వల్ల ఆయా ఫ్రాంచైజీలు వారిపై నమ్మకం ఉంచాయి. దీంతో వీళ్లంతా ఒక్కసారిగా కోటీశ్వరులు అయిపోయారు.

ABOUT THE AUTHOR

...view details