Nitish Kumar Reddy Debut Century :మెల్బోర్న్ టెస్టులో తెలుగుతేజం సెంచరీ (105* పరుగులు)తో కదం తొక్కాడు. కష్టాల్లో ఉన్న టీమ్ఇండియాను అద్భుత పోరాటంతో మంచి స్థితిలోకి తీసుకొచ్చాడు. ఈ క్రమంలోనే 171 బంతుల్లో కెరీర్లో తొలి అంతర్జాతీయ శతకం నమోదు చేశాడు. నితీశ్‌కు తొలి శతకమే ఆస్ట్రేలియా గడ్డపై కావడం విశేషం. ఇక నితీశ్ రెడ్డి శతకాన్ని స్టేడియంలో స్వయంగా వీక్షించిన అతడి తండ్రి భావోద్వేగానికి గురయ్యారు.
కాగా, ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన నిశీశ్ అద్భుత పోరాట పటిమ కనబర్చాడు. వాషింగ్టన్ సుందర్ (50 పరుగులు)తో కలిసి ప్రత్యర్థి బౌలర్లకు ఎక్కడా బెదరకుండా పరుగులు నమోదు చేశాడు. ఈ ఇద్దరూ కలిసి ఎనిమిదో వికెట్‌కు 285 బంతులు ఎదుర్కొని 127 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే నితీశ్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఆసీస్ గడ్డపై 8వ స్థానంలో వచ్చి అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఈ లిస్ట్‌లో ఇదివరకు అనిల్ కుంబ్లే (ఆడిలైడ్‌లో 87 పరుగులు) టాప్‌లో ఉండగా, తాజాగా నితీశ్ ఈ రికార్డ్ బ్రేక్ చేశాడు.
ఆసీస్‌లో 8వ స్థానంలో అత్యధిక పరుగులు బాదిన ఇండియన్స్
- 105*- నితీష్ రెడ్డి- మెల్బోర్న్- 2024
- 87 -అనిల్ కుంబ్లే - అడిలైడ్- 2008
- 81- రవీంద్ర జడేజా- సిడ్నీ- 2019
- 67* - కిరణ్ మోర్ - మెల్బోర్న్- 1991
- 67 - శార్దుల్ ఠాకూర్ - బ్రిస్బేన్- 2021