Special Story on Moodu Gudisela Thanda in Nalgonda District : అదో మారుమూల గిరిజన తండా. ఏళ్ల క్రితం ఒక్క కుటుంబం ఒక్క గుడిసెతో మొదలై, మూడు గుడిసెల తండాగా పేరు తెచ్చుకుంది. ఈ తండా నల్గొండ జిల్లాలో ఉంది. గాంధీనగర్ తండాకు చెందిన నేనావత్ చంద్రు 70 ఏళ్ల కిందట భార్య చాందినిని తీసుకుని బాహ్య ప్రపంచానికి దూరంగా అడవిలో, కొండల్లో, గుట్టల్లో ప్రకృతి ఒడిలో తన భూమిలో ఓ పూరిల్లు ఏర్పాటు చేసుకున్నారు. వ్యవసాయాన్ని జీవనాధారంగా చేసుకుంటూ తండ్రి బాటలోనే జీవించారు. వర్షపు నీటిపై ఆధారపడి జొన్నలు, సజ్జలు పండిస్తూ జీవనం సాగించారు. వీరికి రొట్టెలు, కారం, పచ్చళ్లు ఆహారమైంది.
చంద్రుకు ముగ్గురు కుమారులు పూర్య, దూద, గాంస్య. వీరు ఇదే ప్రాంతంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి పెళ్లిళ్లు కావడంతో పూరిళ్లు ఏర్పాటు చేసుకుని వేర్వేరుగా కాపురం పెట్టారు. అలా మూడు స్థిర నివాసాలు ఏర్పాటయ్యాయి.
ఆ ఊరి రైతు నిజంగా రాజే! : ఆలోచన భిన్నం - సాగు లాభదాయకం
అయితే అప్పట్లో కరెంటు అంటే తెలియని వీరికి సీపీఐ నాయకుడు గులాం రసూల్ సహాయం చేసి ఎలాగైనా వీరిని వెలుగులోకి తీసుకు రావాలనే ఉద్దేశంతో నాటి ఎంపీగా ఉన్న ధర్మబిక్షం సహకారంతో వీరుంటున్న ప్రాంతానికి విద్యుత్ నియంత్రికను మంజూరు చేయించారు. అప్పుడు దీని మంజూరులో గ్రామం పేరు చిరునామాలో మూడు గుడిసెల తండా అని నమోదు చేయడంతో అప్పటి నుంచి మూడు గుడిసెల తండాగా మారిపోయింది.
ఇప్పటికీ వ్యవసాయమే జీవనాధారం : చంద్రు ముగ్గురు కుమారుల్లో ఇద్దరికి ముగ్గురు, ఒకరికి ఇద్దరు చొప్పున ఎనిమిది మంది పిల్లలు పుట్టారు. వారికి పెళ్లిళ్లై, పిల్లలు, వారికి పిల్లలు. ఇలా మూడు తరాలు కావడంతో సుమారు 20 కుటుంబాలు ఏర్పడ్డాయి. ఒకే వంశానికి చెందిన వీరి బలగం సుమారు 60 మంది వరకు ఉంటారు. ఇప్పటికి వీరంతా వ్యవసాయాన్నే ఆధారంగా చేసుకుని జీవిస్తున్నారు. ఒక్కరు కూడా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లలేదు. ఒకరిద్దరు మాత్రమే బోరు బండిపై వెళ్లి తిరిగి ఇక్కడికే వస్తారు. ప్రస్తుతం చంద్రు ముగ్గురు కుమారుల్లో ఇద్దరు ఉన్నారు. వీరంతా స్వచ్ఛమైన వాతావరణంలో జీవిస్తుండటంతో నేటికీ ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పటికీ ఆహారంలో జొన్న రొట్టెలు తీసుకోవడంతో బలంగా ఉన్నట్లు తెలిపారు.
వృద్ధాప్యంలో తోడు కోసం ఒంటరి పెద్దల 'స్వయంవరం' - ఇప్పటికే 3 వేల మంది!
మట్టికుండకు మంగళ సూత్రం - ఎలమాస పండుగలో ఎన్నెన్ని ప్రత్యేకతలో