తెలంగాణ

telangana

ETV Bharat / sports

బోర్డర్ గావస్కర్​లో జైస్వాల్​ సెంచరీ - ఒక్క శతకంతో 8 రికార్డులు సొంతం!

ఆసీస్​పై దూకుడు - సెంచరీతో జైస్వాల్ రికార్డులే రికార్డులు!

Yashasvi Jaiswal Border Gavaskar Trophy
Yashasvi Jaiswal (Associated Press)

By ETV Bharat Sports Team

Published : Nov 24, 2024, 9:21 AM IST

Yashasvi Jaiswal Border Gavaskar Trophy :ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో భారత యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ దూకుడుగా ఆడుతున్నాడు. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీతో చెలరేగిపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్​ అయిన జైస్వాల్, రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం 205 బంతుల్లో సెంచరీ బాదేశాడు. అయితే తన కెరీర్‌లో ఇది నాలుగో శతకం కావడం విశేషం. ఈ క్రమంలో ఏకంగా 8 రికార్డులను యశస్వి సొంతం చేసుకున్నాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్‌తో (77) కలిసి తొలి వికెట్‌కు 201 పరుగులు జోడించాడు. అనంతరం రాహుల్‌ పెవిలియన్‌కు చేరాడు.

ఈ సెంచరీతో జైస్వాల్ సాధించిన రికార్డులు ఇవే :

  1. మొదటి 15 టెస్టుల్లో 1500+ పరుగులు స్కోర్ చేసి తొలి ఆసియా బ్యాటర్‌గా రికార్డు.
  2. ఆస్ట్రేలియాలో ఆడిన మొదటి టెస్టులోనే శతకం బాదిన మూడో టీమ్ఇండియా క్రికెటర్​గా ఘనత.
  3. ఇన్నింగ్స్‌ పరంగా అత్యంత ఫాస్ట్​గా 1500+ పరుగులు చేసిన రెండో భారతీయ బ్యాటర్‌గా రికార్డు. 28 ఇన్నింగ్స్‌ల్లో జైస్వాల్ ఈ ఘనతను అందుకున్నాడు. అయితే అంతకుముందు ఈ లిస్ట్​లో ఛతేశ్వర్ పుజారా ఉన్నాడు. అతడు కూడా 28 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మార్క్‌ను అందుకొన్నాడు.
  4. ఆసీస్​పై సెంచరీ చేసిన రెండో యంగెస్ట్‌ ఓపెనర్‌గా యశస్వి చరిత్రకెక్కాడు. 22 ఏళ్ల 330 రోజుల వయసులో జైస్వాల్​ ఈ రికార్డు సాధించాడు. అతడి కంటే ముందు ఈ జాబితాలో కేఎల్ రాహుల్ (22 ఏళ్ల 263 రోజులు) ఉన్నాడు.
  5. భారత్ తరఫున 23 ఏళ్ల వయసులోపే టెస్టుల్లో అత్యధిక సెంచరీలు బాదిన ఐదో బ్యాటర్ జైస్వాల్​ (4). ఇక సచిన్ అందరికంటే ఎక్కువగా 8 సెంచరీలు చేశాడు.
  6. ఆస్ట్రేలియాలో ఆ జట్టుపై చివరిసారిగా సెంచరీ నమోదు చేసిన బ్యాటర్ కేఎల్ రాహుల్. అయితే 2014-15 సీజన్‌లో అతడు ఈ ఘనత సాధించగా, ఇప్పుడు ఆ రికార్డును జైస్వాల్ తన ఖాతాలో వేసుకున్నాడు.
  7. యశస్వి కంటే ముందు జైసింహా (1967-68), దిగ్గజ మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ (1977-78) సాధించారు. ఈ ముగ్గురూ రెండో ఇన్నింగ్స్‌లోనే చేయడం విశేషం.
  8. 23 ఏళ్లు నిండకముందే ఒకే క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన లిస్ట్​లో యశస్వి ఐదో బ్యాటర్​గా రికార్డుకెక్కాడు. ఇక ఈ ఏడాది యశస్వి 3 శతకాలు బాదాడు. అయితే అందరికంటే సునీల్ గావస్కర్ (1971లో 4 సెంచరీలు) సాధించాడు.

ABOUT THE AUTHOR

...view details