ETV Bharat / sports

రూ. 27 కోట్లు కాదు! - ఐపీఎల్ రెమ్యూనరేషన్​లో పంత్​కు వ‌చ్చేది ఎంతంటే? - RISHABH PANT IPL REMUNERATION

ఐపీఎల్ రెమ్యూనరేషన్​కు ట్యాక్స్ కోత! - నిజానికి ప్లేయర్ల చేతికి ఎంత వస్తుందంటే?​

Rishabh Pant
Rishabh Pant (IANS Photo)
author img

By ETV Bharat Sports Team

Published : Nov 27, 2024, 7:11 PM IST

Rishabh Pant IPL Remuneration : తాజాగా జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో యంగ్ బ్యాటర్ రిషభ్ పంత్ అత్యధిక ధర అందరినీ ఆశ్చర్యపరిచాడు. లఖ్​నవూ సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ పంత్​ను ఏకంగా ను రూ.27 కోట్లకు సొంతం చేసుకుంది. అయితే ఈ వార్త తెలిసిన దగ్గరి నుంచి చాలా మందికి ఓ సందేహం వచ్చే ఉంటుంది. పంత్​కు ఆ రూ.27 కోట్ల రెమ్యూనరేషన్ ఆన్ హ్యాండ్ వస్తుందా? లేకుంటే ట్యాక్స్​లు మినహాయించి అంతకంటే తక్కువ వస్తుందా అని నెటిజన్లు అనుకుంటున్నారు. అయితే క్రీడా వర్గాల సమాచారం ప్రకారం వాస్తవానికి పంత్ చేతికి రూ.27 కోట్లు రాదట. అందులో రూ.8.1 కోట్లు పన్నులకు పోగా మిగతా రూ. 18.9 కోట్లు మాత్రమే తనకు అందుతాయని తెలుస్తోంది.

ఇలా అయితేనే ఫ్రాంచైజీ నుంచి డబ్బు!
అయితే పంత్ టోర్నీకి ముందు గాయపడితే ఆ డబ్బు రాదట. అలాగే వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ నుంచి తప్పుకున్నా కూడా డబ్బు ఇవ్వరని తెలుస్తోంది. టోర్నీ మధ్యలో గాయపడి మిగితా మ్యాచ్​లకు దూరమైతే మాత్రం డబ్బు చెల్లిస్తారట. ఇక భారత్ మ్యాచ్​లకు ఆడుతూ గాయపడితే డబ్బు చెల్లిస్తారని సమాచారం.

ఆటగాళ్లకు ఇచ్చే ఐపీఎల్ జీతాలపై పన్ను ఎలా విధిస్తారు?
ఐపీఎల్​లో వచ్చే ఆదాయంపై ఇండియన్, విదేశీ ప్లేయర్లకు భారత ప్రభుత్వం పన్ను విధిస్తుంది. ఇది క్రికెటర్లు ఉండే నివాస ప్రదేశం, దేశంలో వారు ఆర్జించే ఆదాయం ఆధారంగా మారుతూ ఉంటుంది. భారత్​కు చెందిన ప్లేయర్స్​ను ఇండియా పౌరులుగా గుర్తిస్తారు. వీరికి వచ్చిన ఆదాయంలో 30 శాతం ట్యాక్స్ పడుతుంది. విదేశీ ప్లేయర్లను నాన్ రెసిడెంట్లుగా పరిగణిస్తారు. కాబట్టి వీరికీ అంతే మొత్తంలో పన్ను ఉంటుంది.

ఇదిలా ఉండగా, ఐపీఎల్​లో వచ్చిన మొత్తాన్ని పొందేందుకు ప్లేయర్లు బీసీసీఐ, ఫ్రాంచైజీతో త్రైపాక్షిక ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఫ్రాంచైజీ చెల్లింపు చేయడంలో విఫలమైతే, బీసీసీఐ చర్యలు తీసుకుంటుంది.

ట్యాక్స్ పోగా వీరికి ఎంత డబ్బు వస్తుందంటే?
స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్​ను పంజాబ్ కింగ్స్ రూ.26.75 కోట్లకు దక్కించుకుంది. అందులో రూ.7.95 కోట్లు ట్సాక్స్ పోనూ, శ్రేయస్ చేతికి రూ. 18.8 కోట్లు రానుంది.

అర్ష్‌దీప్ సింగ్​ను రూ.18 కోట్లకు పంజాబ్ జట్టు కొనుగోలు చేసింది. అందులో రూ.5.4 కోట్లు ట్యాక్స్​కు పోగా, రూ.12.6 కోట్లు అర్ష్‌దీప్ సింగ్ చేతికి రానుంది.

మిచెల్ స్టార్క్​కు వచ్చిన రూ.11.75 కోట్లులో పన్నులు పోనూ రూ.8.25 కోట్లు రానుంది. అలాగే ఐపీఎల్ వేలంలో ఆటగాడి ప్రైస్​లో 30శాతం ట్యాక్స్ పడుతుంది. ఆ తర్వాత మిగిలిన మొత్తం ప్లేయర్​కు ఏటా అందుతుంది.

రెండు రోజుల పాటు వేలం
సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా రెండు రోజులపాటు ఐపీఎల్‌ మెగా వేలం జరిగింది. మొత్తం 182 మంది క్రికెటర్లను ఫ్రాంఛైజీలు కొనుగోలు చేశాయి. అందులో 62 మంది విదేశీ ఆటగాళ్లున్నారు. 8 మందిని జట్లు ఆర్టీఎం చేసుకున్నాయి. అన్ని జట్లు కలిపి ఆటగాళ్ల కొనుగోళ్ల కోసం మొత్తం రూ.639.15 కోట్లు ఖర్చు చేశాయి.

ఈ స్టార్లకు నిరాశ!

డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్ వంటి విదేశీ స్టార్టకు ఈ వేలంలో మొండిచేయి ఎదురైంది. అలాగే శార్దూల్ ఠాకూర్, మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్, ఉమేశ్ యాదవ్ వంటి టీమ్ ఇండియా ప్లేయర్లను ఏ ప్రాంచైజీ కొనుగోలు చేయలేదు.

ఐపీఎల్​ 2025 - ఓవర్​నైట్​లో కోటీశ్వరులైన యంగ్ ప్లేయర్స్ వీరే

వేలంలో అమ్ముడైన తెలుగు కుర్రాళ్లు వీరే - వాళ్ల గత రికార్డులు ఎలా ఉన్నాయంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.