తెలంగాణ

telangana

ETV Bharat / sports

WPL 2024 శెభాష్ స్మృతి - వీడియో కాల్​లో కోహ్లీ అభినందనలు - Virat Kohli Video Calls smrithi

WPL 2024 Virat Kohli Video Calls Smriti Mandhana : ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన క్షణం రాగానే ఆర్సీబీ ఆటగాళ్లు భావోద్వేగానికి గురయ్యారు. వారి సంతోషంలో కింగ్‌ కోహ్లీ కూడా పాలుపంచుకున్నాడు. జట్టుకు వీడియో కాల్‌ చేసి అభినందించాడు.

WPL 2024 Virat Kohli Video Calls Smriti Mandhana
కోహ్లీ వీడియో కాల్ ఆర్సీబీ

By ETV Bharat Telugu Team

Published : Mar 18, 2024, 9:53 AM IST

WPL 2024 Virat Kohli Video Calls Smriti Mandhana :తొలిసారి WPL 2024 టైటిల్ గెలిచిన తర్వాత ఆర్సీబీ ఆటగాళ్లు భావోద్వేగానికి గురయ్యారు. టీమిండియా స్టార్ బ్యాటర్, RCB స్టార్‌ బ్యాటర్‌ విరాట్ కోహ్లీ కూడా సూపర్ ఉమెన్ అని సోషల్ మీడియా వేదికగా పోస్టు చేసి ఆనందం వ్యక్తం చేశాడు. మహిళల జట్టు టైటిల్ గెలిచిన అనంతరం అర్సీబీ ప్లేయర్లతో కింగ్‌ కోహ్లీ వీడియో కాల్‌ కూడా చేసి మాట్లాడాడు. కెప్టెన్ స్మృతి మంధానతో కాసేపు మాట్లాడిన విరాట్‌ అనంతరం ఇతర ప్లేయర్లతో కూడా ముచ్చటించాడు. అర్సీబీ ట్రోఫీను అందుకోవడానికి కొద్దిసేపటి ముందు విరాట్‌ కోహ్లీ ఈ కాల్‌ మాట్లాడినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. తమ ఫ్రాంచైజీకి డబ్ల్యూపీఎల్‌ టైటిల్‌ దక్కడంతో ఐపీఎల్‌ ఆర్‌సీబీ స్టార్స్‌ విరాట్‌ కోహ్లీతో పాటు గ్లెన్‌ మ్యాక్స్‌వెల్, మాజీ సభ్యులు క్రిస్‌ గేల్, ఏబీ డివిలియర్స్ అభినందనలు తెలిపారు.

మ్యాచ్‌ ఎలా సాగిందంటే :మహిళల ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. దిల్లీ క్యాపిటల్స్​తో జరిగిన ఫైనల్ పోరులో బెంగళూరు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన దిల్లీని బెంగళూరు బౌలర్లు కేవలం 113 పరుగులకే కట్టడి చేశారు. ఓపెనర్లు షెఫాలి వర్మ 44, మెగ్ లానింగ్ 23 పరుగులతో రాణించడంతో దిల్లీ ఓ దశలో ఒక వికెట్ నష్టానికి 64 పరుగులు చేసి పటిష్టంగా కనిపించింది. కానీ బెంగళూరు స్పిన్నర్ల మాయాజాలంతో ఆ తర్వాత దిల్లీ వరుసగా వికెట్లు కోల్పోయింది. బెంగళూరు బౌలర్లలో శ్రేయాంకా పాటిల్ 4, సోఫీ మోలినక్స్ 3, ఆశా శోభన 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం 113 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 19.3 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి బెంగళూరు ఛేదించింది. ఓపెనర్లు స్మృతి మంధాన 31, సోఫీ డివైన్ 32 పరుగులతో RCBకు శుభారంభం అందించారు. తర్వాత ఎలీస్ పెర్రీ మ్యాచ్‌ను ముగించింది. ఈ విజయంతో తొలిసారి బెంగళూరు ఖాతాలో కప్పు చేరింది. ఈ విజయంతో ఆర్సీబీ అభిమానుల 17 ఏళ్ల ఫ్యాన్స్ నిరీక్షణకు తెరపడింది. దీంతో సోషల్ మీడియా వేదికగా ఆర్సీబీ అనే పదం ట్రెండింగ్‌గా మారింది. బెంగళూరులోని వీధుల్లో యువత విజయోత్సవ ర్యాలీలు చేస్తున్నారు. ఈ సీజన్ ఐపీఎల్ పురుషుల జట్టు కూడా ట్రోఫీ అందుకోవాలని ఆశిస్తున్నారు.

ఎంత ప్రైజ్‌ మనీ అంటే : ఉమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ రెండో సీజన్‌లో విజేతగా నిలిచిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు ఆరు కోట్ల రూపాయల ప్రైజ్‌ మనీ లభించింది. రన్నరప్‌గా నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు మూడు కోట్ల రూపాయల ప్రైజ్‌ మనీ దక్కింది. మొత్తం తొమ్మిది మ్యాచుల్లో 347 పరుగులు చేసి ఆరెంజ్‌ క్యాప్‌ దక్కించుకున్న బెంగళూరు ఆల్‌రౌండర్‌ ఎలీస్‌ పెర్రీకి అయిదు లక్షల రూపాయల ప్రైజ్‌ మనీ దక్కింది. టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా బెంగళూరుకు చెందిన శ్రేయాంక పాటిల్‌ నిలచింది. ఈ టోర్నమెంట్‌లో 13 వికెట్లు తీసిన శ్రేయాంక పాటిల్‌ పర్పుల్‌ క్యాప్‌ దక్కించుకుంది. వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఎమర్జింగ్‌ ప్లేయర్‌గా బెంగళూరు ప్లేయర్‌ శ్రేయాంక పాటిల్‌ మోస్ట్‌ వాల్యుబుల్‌ ప్లేయర్‌గా దీప్తి శర్మ నిలిచారు. బెస్ట్‌ క్యాచ్‌ ఆఫ్‌ ద టోర్నీ అవార్డును ముంబయి ప్లేయర్‌ సజన సజీవన్‌ దక్కించుకోగా ఫెయిర్‌ ప్లే టీమ్‌ అవార్డును రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు దక్కించుకుంది.

ABOUT THE AUTHOR

...view details