తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Jan 23, 2024, 1:33 PM IST

ETV Bharat / sports

మహిళల ప్రీమియర్​ లీగ్​కు షెడ్యూల్​ ఖారారు - రేసులో పాల్గొననున్న టీమ్స్​ ఏవంటే ?

WPL 2024 Schedule : గతేడాది ప్రారంభమై ఎంతో సక్సెస్​ఫుల్​గా నడిచిన మహిళల ప్రీమియర్​ లీగ్​ మరో కొత్త సీజన్​తో క్రికెట్​ లవర్స్​ను అలరించనుంది. ఈ నేపథ్యంలో తాజాగా నయా షెడ్యూల్​ విడుదలైంది. ఈ నేపథ్యంలో మ్యాచ్​ తేదీలు, వేదికల లిస్ట్​ను ఓ సారి చూద్దాం.

WPL 2024 Schedule
WPL 2024 Schedule

WPL 2024 Schedule :మహిళల ప్రీమియర్‌ లీగ్‌ రెండో సీజన్‌ షెడ్యూల్ ఖరారైంది. గతేడాది ఆరంభమైన ఈ సిరీస్​ ఎంతో ఆసక్తికరంగా సాగింది. ఈ సారి కూడా అంతే రసవత్తరంగా జరిగేందుకు సర్వం సిద్ధమైంది. ఫిబ్రవరి 23 నుంచి రెండో సీజన్‌ ప్రారంభం కానున్న వేళ తాజాగా షెడ్యూల్​ విడుదలైంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌, రన్నరప్‌ దిల్లీ క్యాపిటల్స్‌ తలపడనున్నాయి. ఈ సీజన్‌లో మొదటి దశ మ్యాచ్‌లు బెంగళూరులో, ఆ తర్వాతి మ్యాచ్‌లు దిల్లీలో జరగనున్నాయి. ఎలిమినేటర్‌, ఫైనల్‌ కలిపి మొత్తం ఈ సీజన్​లో 22 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇక మార్చి 17న దిల్లీలో ఫైనల్ మ్యాచ్‌ ఉంటుంది. ఇక మ్యాచ్​ షెడ్యుల్​ను ఓ సారి చూస్తే

  1. ఫిబ్రవరి 23- ముంబయి ఇండియన్స్ vs దిల్లీ క్యాపిటల్స్ (బెంగళూరు)
  2. ఫిబ్రవరి 24- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs యూపీ వారియర్స్ (బెంగళూరు)
  3. ఫిబ్రవరి 25- గుజరాత్ జెయింట్స్ vs ముంబయి ఇండియన్స్ (బెంగళూరు)
  4. ఫిబ్రవరి 26- యూపీ వారియర్స్ vs దిల్లీ క్యాపిటల్స్ (బెంగళూరు)
  5. ఫిబ్రవరి 27- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs గుజరాత్ జెయింట్స్ (బెంగళూరు)
  6. ఫిబ్రవరి 28- ముంబయి ఇండియన్స్ vs యూపీ వారియర్స్ (బెంగళూరు)
  7. ఫిబ్రవరి 29- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs దిల్లీ క్యాపిటల్స్ (బెంగళూరు)
  8. మార్చి 1- యూపీ వారియర్స్ vs గుజరాత్ జెయింట్స్ (బెంగళూరు)
  9. మార్చి 2- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ముంబయి ఇండియన్స్ (బెంగళూరు)
  10. మార్చి 3- గుజరాత్ జెయింట్స్ vs దిల్లీ క్యాపిటల్స్ (బెంగళూరు)
  11. మార్చి 4- యూపీ వారియర్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (బెంగళూరు)
  12. మార్చి 5- దిల్లీ క్యాపిటల్స్ vs ముంబయి ఇండియన్స్ (దిల్లీ)
  13. మార్చి 6- గుజరాత్ జెయింట్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (దిల్లీ)
  14. మార్చి 7- UP వారియర్స్ vs ముంబయి ఇండియన్స్ (దిల్లీ)
  15. మార్చి 8- దిల్లీ క్యాపిటల్స్ vs యూపీ వారియర్స్ (దిల్లీ)
  16. మార్చి 9- ముంబయి ఇండియన్స్ vs గుజరాత్ జెయింట్స్ (దిల్లీ)
  17. మార్చి 10- దిల్లీ క్యాపిటల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (దిల్లీ)
  18. మార్చి 11- గుజరాత్ జెయింట్స్ vs యూపీ వారియర్స్ (దిల్లీ)
  19. మార్చి 12- ముంబయి ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (దిల్లీ)
  20. మార్చి 13- దిల్లీ క్యాపిటల్స్ vs గుజరాత్ జెయింట్స్ (దిల్లీ)
  21. మార్చి 15- ఎలిమినేటర్ (దిల్లీ)
  22. మార్చి 17- ఫైనల్ (దిల్లీ)

ABOUT THE AUTHOR

...view details