WPL 2024 Squads Strengthness : మహిళల క్రికెట్‌కు ఆదరణ పెరిగిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ లాగే ఇప్పుడు వాళ్లకూ ఓ లీగ్ ఉండాలనే ఉద్దేశంతో మహిళల ప్రిమియర్ లీగ్‌ను మొదలుపెట్టింది. దీనికి మంచి ఆదరణే లభించింది. ఈ ఏడాది కొంచెం ముందుగానే గతేడాది జరిగిన ఫార్మాట్ తరహాలోనే రెండో సీజన్ ప్రారంభం అవుతోంది. అవే జట్లు బరిలోకి దిగబోతున్నాయి. తొలి సీజన్లో ట్రోఫీని ముద్దాడిన ముంబయి ఇండియన్స్ మరోసారి టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగబోతుంది. నిరుటి రన్నరప్ దిల్లీ క్యాపిటల్స్ కూడా బలంగానే కనిపిస్తోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, యూపీ వారియర్స్, గుజరాత్ టైటాన్స్ ఈసారి ప్రదర్శన మార్చి ట్రోఫీలను అందుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాయి.
WPL 2024 Mumbai Indians :తొలి సీజన్లో అద్భుత ప్రదర్శనతో ట్రోఫీని ముద్దాడిన హర్మన్ ప్రీత్ సేన ఈ సారి కూడా కప్పు గెలిచేందుకు మెండుగానే అవకాశాలున్నట్లు అర్థమవుతోంది. హర్మన్‌కు తోడు యాక్తిక భాటియా, పూజ వస్త్రాకర్, అమన్‌జ్యోత్ లాంటి టీమ్‌ఇండియా క్రికెటర్లు టీమ్‌లో ఉన్నారు. విదేశీ స్టార్లు హేలీ మాథ్యూస్, అమేలియా కెర్, నాట్ సీవర్ క్లో ట్రైయన్ బ్యాటుతో, బంతితో అదిరే ప్రదర్శన చేయగలరు. షబ్నమ్, ఇసీ వాంగ్‌ల పేస్ ఆ జట్టుకు కలిసొచ్చే మరో బలం అనే చెప్పాలి.
దేశీయ క్రికెటర్లు : హర్మన్‌ప్రీత్ కౌర్, యాస్తిక భాటియా, పూజ వస్త్రాకర్, అమన్‌జ్యోత్ కౌర్, అమన్‌దీప్ కౌర్, సైకా ఇషాక్, జింతిమని కలిత, ప్రియాంక బాల, ఫాతిమా జాఫర్, హుమేరియా కాజి, కీర్తన సత్యమూర్తి, సజన సజీవన్.
విదేశీయులు: హేలీ మాథ్యూస్, అమేలియా కెర్, నాట్ సీవర్, క్లో ట్రైయన్, షబ్నమ్ ఇస్మాయిల్, ఇసీ వాంగ్.
WPL 2024 Delhi Capitals :గత ఏడాది ముంబయికి దీటుగా ప్రదర్శనలో చెలరేగి ఫైనల్ చేరింది దిల్లీ క్యాపిటల్స్. కానీ ఫైనల్లో బోల్తా కొట్టింది. షెఫాలి వర్మ, జెమీమా, తానియా ఇండియన్ స్టార్లు బ్యాటింగ్‌లో బలం. తితాస్ సాధుకు తోడు శిఖ పాండే, పూనమ్ యాదవ్, అరుంధతి రెడ్డి లాంటి సీనియర్లు బౌలింగ్‌లో జట్టుకు అండగా ఉన్నారు. ఇక దిల్లీ విదేశీ బలం విషయానికొస్తే మరిజేన్ కాప్, అనాబెల్ సదర్లాండ్, ఎలీస్ క్యాప్సీ, జెస్ జొనాసెన్ లాంటి మేటి ఆల్‌రౌండర్లు జట్టులో ఉన్నారు. మెగ్ లానింగ్ బ్యాటింగ్ కూడా బాగా కలిసొస్తుంది.
దేశీయ క్రికెటర్లు: షెఫాలి వర్మ, జెమీమా రోడ్రిగ్స్, తానియా భాటియా, శిఖ పాండే, మిన్ను మణి, పూనమ్ యాదవ్, అరుంధతి రెడ్డి, తితాస్ సాధు, రాధ యాదవ్, అశ్విని కుమారి, అపర్ణ మొండల్, స్నేహ దీప్తి.
విదేశీయులు: మరిజేన్ కాప్, మెగ్ లానింగ్, ఎలీస్ క్యాప్సీ, అనాబెల్ సదర్లాండ్, జెస్ జొనాసెన్, లారా హారిస్.
WPL 2024 RCB : జట్టులో స్టార్లకు కొదవ లేకపోయిన అతి చెత్త ప్రదర్శన చేసింది ఆర్సీబీ. స్మృతి మంధాన, రిచా ఘోష్, రేణుక సింగ్ లాంటి భారత స్టార్లు ఆ జట్టులో ఉన్నారు. శ్రేయాంక పటేల్, సబ్బినేని మేఘన కూడా టాలెంట్ ప్లేయర్సే. ఎలీస్ పెర్రీ, సోఫీ డివైన్, హెదర్ నైట్, నదీన్ డిక్లెర్క్ లాంటి బేస్ట్ ఆల్‌రౌండర్స్ టీమ్‌లో ఉన్నారు. కేట్ క్రాస్, జార్జియా వేర్‌హామ్‌ల బౌలింగ్ కూడా ప్లస్సే..