తెలంగాణ

telangana

ETV Bharat / sports

WPL 2024 బెంగళూరు భళా - ఇక మిగిలింది IPL ట్రోఫీ మాత్రమే! - WPL 20224 RCB Trophy

WPL 20224 RCB Trophy : ఈ సాలా కప్‌ నమదే! ఇన్నాళ్లకు ఆర్సీబీ కల తీరింది. తాజాగా జరిగిన డబ్ల్యూపీఎల్ ఫైనల్​లో అమ్మాయిల జట్టు ట్రోఫీని ముద్దాడింది. ఇక మిగిలింది ఐపీఎల్ టైటిల్ మాత్రమే. చూడాలి మరి ఈ అమ్మాయిల స్ఫూర్తితోనైనా త్వరలోనే ప్రారంభం కాబోయే ఐపీఎల్‌లో ఆర్సీబీ పురుషుల జట్టు విజేతగా నిలుస్తుందేమో.

WPL 2024 బెంగళూరు భళా - ఇక మిగిలింది ఐపీఎల్ ట్రోఫీ మాత్రమే!
WPL 2024 బెంగళూరు భళా - ఇక మిగిలింది ఐపీఎల్ ట్రోఫీ మాత్రమే!

By ETV Bharat Telugu Team

Published : Mar 18, 2024, 6:56 AM IST

WPL 20224 RCB Trophy : ఈ సాలా కప్‌ నమదే! ఈ సారి ఇది స్లోగన్​గా మిగిలిపోలేదు. కల నిజమైంది. అవును మీరు చదుతువుతున్నది నిజం. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ట్రోఫీని ముద్దాడింది. ఇన్నేళ్ల పాటు కలగా మిగిలిపోయిన కప్‌ను సాధించింది. 16 ఏళ్లుగా ఐపీఎల్‌లో పురుషుల ఫ్రాంఛైజీకి సాధ్యం కాని విజయాన్ని డబ్ల్యూపీఎల్‌ రెండో సీజన్‌లోనే అమ్మాయిల జట్టు సాధించింది. దీంతో ఆర్సీబీ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

రాత మారింది : అసలు ప్రతి సారి ఐపీఎల్‌కు ముందు ఈ సాలా కప్‌ నమదే అంటూ ఆర్సీబీ పురుషుల జట్టు బలంగా ఆత్మవిశ్వాసంతో బరిలో దిగడం, చివరికి ఉసూరుమనిపించి నిష్క్రమించడం ఎన్నో ఏళ్లుగా చూస్తూనే ఉన్నాం. అలా ప్రతిసారి జట్టు ఓటమిని అందుకోవడం, దీంతో ఆ జట్టుకు భారీగా ఉన్న అభిమాన గణం నిరాశతో చెప్పుకోలేని బాధను భరిస్తూ రావడం జరుగుతూనే వస్తోంది. కానీ ఇప్పుడు ఆర్సీబీ మహిళలు తమ జట్టు తలరాతను మార్చారు. ట్రోఫీని ముద్దాది అభిమానులను చెప్పలేని ఆనందాన్ని ఇచ్చారు. ఫ్యాన్స్ ఇప్పుడంతా సంతోషంలో మునిగి తేలుతున్నారు.

సవాళ్లను దాటి టైటిల్​ను ముద్దాడి :ఇప్పటివరకూ ఐపీఎల్‌లో ఆర్సీబీ తరఫున ఎంతో మంది దిగ్గజ ఆటగాళ్లు జట్టుకు ఆడారు. కానీ ఒక్కసారి కూడా బెంగళూరు జట్టు ట్రోఫీని అందుకోలేకపోయింది. 2009, 2011, 2016 సీజన్లలో ఫైనల్(IPL RCB Final) చేరినా బోల్తా పడింది. కీలక మ్యాచ్‌ల్లో ఒత్తిడికి గురై చేతులెత్తేయడం ఆ జట్టుకు అలవాటుగా మారిపోయింది. ఇక గత సీజన్​(డబ్ల్యూపీఎల్ తొలి సీజన్​) స్మృతి మంధాన సారథ్యంలోని ఆర్సీబీ కూడా చెత్త ప్రదర్శన చేసింది. ఆడిన 8 మ్యాచ్‌ల్లో కేవలం రెండే గెలిచింది. దీంతో ఇక ఆర్సీబీ తల రాత ఇంతేలే అని అంతా అనుకున్నారు. ఫ్యాన్స్ బాధను వ్యక్తం చేశారు. ఇక ఈ సీజన్‌లోనూ ఆర్సీబీ ప్రయాణం ఒడుదొడుకులతో సాగింది. ఈ సారి కూడా ఆర్సీబీ వెనుదిరుగుతుందని భావించారు. కానీ అనూహ్యంగా ముంబయిపై విజయంతో ప్లేఆఫ్స్‌కు వెళ్లిన ఆ జట్టు ఎలిమినేటర్‌ మ్యాచ్​లోనూ ముంబయిపైనే విజయం సాధించింది దీంతో అంతా సర్​ప్రైజ్ అయ్యారు. ఇక ఫైనల్​కు చేరిన ఆ జట్టు తమకు వచ్చిన అవకాశాన్ని విడిచిపెట్టకుండా దిల్లీ క్యాపిటల్స్​ను ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది.

దిల్లీపై ఇదే తొలిసారి : అసలు ఈ మ్యాచ్‌కు ముందు వరకు కూడా ఈ రెండో సీజన్​లో దిల్లీ క్యాపిటల్స్​పై బెంగళూరు జట్టు విజయాన్ని అందుకుందే లేదు. దీంతో ఈ ఫైనల్​లోనూ ఆర్సీబీపై చాలా మంది ఆశలు వదులుకున్నారు అయితే సీన్ రివర్స్ అయింది. దిల్లీ క్యాపిటల్స్​ ఓపెనర్లు మ్యాచ్ ప్రారంభంలో గట్టిగా రాణించినప్పటికీ ఆ తర్వాత ఆర్సీబీ బౌలింగ్‌లో బలంగా పుంజుకుని దిల్లీని తక్కువ స్కోరుకే పరిమితం చేసింది. ఛేదనలో కూడా గట్టి సవాళ్లను ఎదుర్కొని కఠిన పరిస్థితుల్లో పట్టుదలతో లక్ష్యాన్ని ఛేదించింది.

ప్లేయర్స్​ ప్రదర్శన భళా : ఇక ఈ ఫైనల్లో నాలుగు వికెట్లతో పాటు ఈ సీజన్‌ మొత్తంలో నిలకడ ప్రదర్శన చేసిన శ్రేయాంక పాటిల్‌ (13) అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచింది. సోఫీ మోలనూ (12), ఆశ (12) కూడా బౌలింగ్‌లో మంచి ప్రదర్శన చేాశారు. ఎలీస్‌ పెర్రీ (347) అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలించింది. ఈమె బౌలింగ్‌లోనూ 7 వికెట్లతో తమ ఆల్‌రౌండర్‌ బాధ్యతలను బాగానే నిర్వర్తించింది. కెప్టెన్‌గా స్మృతి మంధాన (300) బ్యాటింగ్‌లో సత్తా చాటింది. రిచా ఘోష్‌ (257) కూడా పర్వాలేదనిపించింది. చూడాలి మరి ఈ అమ్మాయిల స్ఫూర్తితోనైనా త్వరలోనే ప్రారంభం కాబోయే ఐపీఎల్‌లో ఆర్సీబీ పురుషుల జట్టు( IPL RCB) విజేతగా నిలుస్తుందేమో.

ఫైనల్స్​లో ఆర్సీబీ ఘన విజయం - 'ఈ సాలా కప్ నమ్​దే'

వీళ్లంతా టాప్​ క్లాస్ క్రికెటర్లు- అయినా ఐపీఎల్​కు నో!

ABOUT THE AUTHOR

...view details