తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఉమెన్స్​ డే స్పెషల్: భారత క్రీడారంగంలో 'మహిళా మణులు' - Top Women Athletes India

Womens Day 2024 Women Athletes India: భారత క్రీడారంగంలో అనేక మంది మహిళా అథ్లెట్లు తమదైన ముద్ర వేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారెవరో చూద్దాం.

Womens Day 2024 Women Athletes India
Womens Day 2024 Women Athletes India

By ETV Bharat Telugu Team

Published : Mar 8, 2024, 7:25 AM IST

Womens Day 2024 Women Athletes India:క్రీడాకారులు అనగానే గతంలో పురుషుల సంఖ్యే అత్యధికంగా ఉండేది. ఏవో కొన్ని ఆటల్లో మాత్రమే మహిళలు కనిపించేవారు. ఇంకొన్ని ఆటలు పురుషులకే అన్నట్లు ఉండేవి. అయితే అలాంటి రోజులను దాటుకొని ప్రస్తుతం మహిళలు అన్ని రకాల క్రీడల్లో రాణిస్తూ ఎందరో యువతులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. మరి మహిళా దినోత్సవం సందర్భంగా క్రీడారంగంలో సత్తా చాటిన భారత అథ్లెట్లు ఎవరో చూద్దామా!

పీవీ సింధు: ఈ తరం యువతులకు పీవీ సింధు పరిచయం అక్కర్లేని పేరు. ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్​ ఆటల్లో ఏకంగా రెండు మెడల్స్​ సాధించి చరిత్ర సృష్టించింది. భారత్ సహా పలు దేశాల్లో అనేక ఛాంపియన్​షిప్స్ పోటీల్లో పాల్గొని ఘన విజయాలు సాధించి బ్యాడ్మింటన్​లో తన మార్క్ చూపింది. ఇక ఒలింపిక్స్​లో రెండు పతకాలు సాధించిన తొలి భారత మహిళగానూ సింధు చరిత్ర సృష్టించింది.

మిథాలీ రాజ్: జెంటిల్​మెన్ గేమ్​గా పేరున్న క్రికెట్​లో టీమ్ఇండియా మాజీ ప్లేయర్ మిథాలీ రాజ్ అనేక రికార్డులు నెలకొల్పింది. మహిళల క్రికెట్​లో తనదైన ముద్ర వేస్తూ భారత్​కు అనేక విజయాలు అందించింది. మహిళల క్రికెట్​లో ఏకంగా ప్రపంచంలోనే అత్యధిక అంతర్జాతీయ పరుగులు చేసిన ప్లేయర్​గా మిథాలీ (7805 పరుగులు) చరిత్ర సృష్టించింది.

సానియా మీర్జా: స్టార్ అథ్లెట్ సానియా మీర్జా 2003 నుంచి ఓ దశాబ్ద కాలంపాటు భారత టెన్నిస్​ను ఏలింది. తన కెరీర్​లో 6 మేజర్ టైటిళ్లు సాధించి టెన్నిస్​లో తన మార్క్ చూపించింది. ​డబుల్స్​లో వరల్డ్​ నెం.1 ర్యాంక్​ను సైతం సొంతం చేసుకుని ప్రపంచానికి తనేంటో చూపించింది. ఇక భారత్​లోనూ సింగిల్స్​లో ఇప్పటివరకు అత్యధిక రోజులు నెం. 1 ర్యాంక్​లో కొనసాగింది కూడా సానియానే.

హర్మన్​ప్రీత్ కౌర్: మిథాలీ రాజ్​ తర్వాత భారత క్రికెట్​ను ప్రపంచ స్థాయిలో నిలబెట్టే బాధ్యతలు హర్మన్​ప్రీత్ కౌర్ తీసుకుంది. హర్మన్ కెప్టెన్సీలో గతేడాది జరిగిన టీ20లో వరల్డ్​కప్​లో భారత్​ను సెమీస్​దాకా తీసుకెళ్లింది.

వీళ్లతోపాటు బాక్సింగ్‌ క్వీన్‌ మేరీ కోమ్‌, జిమ్నాస్టిక్స్‌లో దీపా కర్మాకర్‌, బ్యాడ్మింటన్​లో సైనా నెహ్వాల్, స్ర్పింటర్​లో ద్యూతీ చంద్, వెయిట్‌ లిఫ్టింగ్‌లో మీరాబాయి చానూ, రెజ్లర్ వినేశ్ ఫొగాట్ సాధించిన ఘనతలు ఎందరికో ఆదర్శం.

ఆసియా బ్యాడ్మింటన్​లో సింధు అదుర్స్- 3-2 తేడాతో చైనాపై భారత్ విక్టరీ

భారత్​కు తిరిగి వస్తా - సానియాతో కలిసి పని చేస్తా : జకోవిచ్

ABOUT THE AUTHOR

...view details