Womens Asian Champions Trophy 2024 : ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత అమ్మాయిల హాకీ జట్టు అదరగొట్టింది. బుధవారం జరిగిన ఓటమి అనేది ఎరుగకుండా తాజాగా జరిగిన మ్యాచ్‌లో టైటిల్‌ను కైవసం చేసుకుంది. తాజాగా జరిగిన ఫైనల్‌లో 1-0తో చైనాను చిత్తు చేసి విజేతగా నిలిచింది. 31వ నిమిషంలో దీపిక గోల్ చేసి భారత్‌ను ఆధిక్యంలో నిలిపింది. తొలి అర్ధ భాగంలో ఇరుజట్లు ఒక్క గోల్ చేయకలేకపోయాయి. అయితే భారత్‌కు నాలుగు పెనాల్టీ కార్నర్‌లు లభించినా వాటిని గోల్స్‌గా మలచలేకపోయింది.
ఇక మూడో క్వార్టర్ ఆరంభంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను దీపిక గోల్‌గా మలిచింది. రెండో అర్ధ భాగంలో స్కోరును సమం చేయడానికి చైనా ప్రయత్నించగా భారత్ అడ్డుకుంది. ఇక ఈ టోర్నీలో చైనా మూడో రన్నరప్‌గా నిలిచింది. మూడు-నాలుగు స్థానాల కోసం జరిగిన మ్యాచ్‌లో జపాన్ 4-1తో మలేషియాను ఓడించి మూడో స్థానంలో నిలిచింది. భారత్ ఈ టైటిల్‌ను దక్కించుకోవడం ఇది మూడోసారి కాగా, అంతకుముందు సౌత్‌కొరియా కూడా మూడుసార్లు ఈ ట్రోఫీని దక్కించుకోవడం గమనార్హం.