ETV Bharat / state

ఎంబీబీఎస్ సీటు సాధించి వారం కాలేదు - అనారోగ్యంతో ఆత్మహత్యాయత్నం చేసింది - MEDICO ATTEMPTS SUICIDE IN SIDDIPET

కళాశాల బిల్డింగ్​పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసిన మెడికల్​ విద్యార్థిని - ఆసుపత్రిలో చేర్పించిన కళాశాల యాజమాన్యం - ఘటనపై ఆరా తీసిన సిద్దిపేట ఏసీపీ

MEDICO ATTEMPTS SUICIDE IN SIDDIPET
MEDICO ATTEMPTS SUICIDE IN SIDDIPET (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 20, 2024, 10:05 PM IST

Medical student Attempts Suicide In Siddipet : వైద్యవిద్యలో అడ్మిషన్ పొంది వారం రోజులు కూడా అవ్వక ముందే ఓ మెడికో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు, మెడికల్ కళాశాల సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్​కు చెందిన గాయత్రి అనే విద్యార్థిని సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లిలో గల సురభి మెడికల్ కళాశాలలో మొదటి ఏడాది చదువుతోంది.

చదవలేకపోతున్నానంటూ సూసైడ్​ నోట్ రాసి : ఈ నెల 17న గాయత్రి తాను అనారోగ్యం కారణంగా చదవలేకపోతున్నానంటూ సూసైడ్ నోట్ రాసి ఉదయం ఎనిమిది గంటల సమయంలో కళాశాల మొదటి అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో విద్యార్థినికి గాయాలవ్వగా సమచారమందుకున్న కళాశాల సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

ఘటనపై ఆరా తీసిన పోలీసులు : అనంతరం విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం అందించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. ఆత్మహత్యాయత్నంకు కారణం ఏమై ఉండవచ్చు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఘటనపై సమాచారమందుకున్న ఏసీపీ మధు బుధవారం సురభి మెడికల్ కళాశాలను సందర్శించి ఘటనపై ఆరా తీశారు. గాయత్రి ఆత్మహత్యాయత్నానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. కళాశాలలో విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినా యాజమాన్యం పోలీసులకు పిర్యాదు చేయకపోవడంతో ఘటనపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

" మాకు అందిన సమాచారం మేరకు సురభి మెడికల్​ కళాశాలను సందర్శించడం జరిగింది. 17వ తేదీ ఉదయం 7 ,8 గంటల మధ్యన ఫస్ట్​ ఇయర్​ చదువుతున్న గాయత్రి అనే విద్యార్థిని దూకి​ చేసి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమె అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతోంది. ఆ ఒత్తిడిని భరించలేక చదవడం కష్టమవుతుండటంతో ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లుగా సూసైడ్​నోట్​లో ఉంది. విద్యార్థినికి చిన్నగాయమైంది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమెకు ఎలాంటి ప్రాణాపాయం లేదు." - మధు, ఏసీసీ సిద్ధిపేట

మీ టార్చర్ వల్లే మా పాప సూసైడ్ చేసుకుంది - బాచుపల్లి కాలేజీపై తల్లిదండ్రుల ఆగ్రహం

పెన్ను కోసం గొడవ - భవనంపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.