ODI World Cup Kuldeep Yadav Counter : భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించి టైటిల్ పోరులో తడబడింది. అయితే ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ పోరులో మాత్రం పరాజయాన్ని చూసింది.
అయితే ఈ మ్యాచ్ జరిగి ఏడాది పూర్తైపోయింది. తాజాగా అప్పుడు జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ ప్రదర్శనను ఓ నెటిజన్ విమర్శిస్తూ పోస్ట్ పెట్టాడు. దానికి కుల్‌దీప్ తిరిగి గట్టి కౌంటర్ వేశాడు.
'ఇలాంటి స్పిన్నర్‌ను పక్కన పెట్టేయొచ్చు కదా' అంటూ సదరు నెటిజన్ అన్నాడు. కుల్‌దీప్ యాదవ్ ఫొటోకు ఆ క్యాప్షన్ జోడించి ఎక్స్‌లో పోస్ట్ చేశాడు.
అయితే తనపై పెట్టిన పోస్ట్‌కు భారత స్పిన్నర్ కుల్దీప్ స్పందించాడు. 'అసలు మీ సమస్య ఏంటి? ఇలాంటి పోస్ట్‌లు పెట్టడం వల్ల మీకు ఏమైనా డబ్బు వస్తుందా? లేదా మీకేమైనా వ్యక్తిగత ద్వేషం ఉందా?" అంటూ ఆ నెటిజన్‌కు గట్టి కౌంటర్ వేశాడు కుల్దీప్. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్‌గా మారింది.
గంగూలీ స్పందన - ఇకపోతే ప్రస్తుతం టీమ్ ఇండియా బోర్డర్ గావస్కర్ ట్రోఫీ కోసం సిద్ధమవుతోంది. మరో రెండు రోజుల్లో 5 టెస్ట్ మ్యాచుల ఈ సిరీస్ ప్రారంభం కానుంది. తొలి టెస్ట్ పెర్త్ వేదికగా జరగనుంది. రోహిత్ శర్మ గైర్హాజరీలో కెప్టెన్‌గా జస్‌ప్రీత్ బుమ్రా జట్టును నడిపించనున్నాడు. అయితే ఈ మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియా దేశవాళీ జట్టుతో భారత్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడలేదు. కేవలం ఇంట్రా స్క్వాడ్‌తోనే వార్మప్ మ్యాచ్ ఆడింది. దీంతో భారత్ సన్నద్ధత బాగోలేదంటూ పలు విమర్శలు వినిపించాయి. వాటిపై భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ కాస్త గట్టిగానే స్పందించాడు. అలాంటి విమర్శలు చేయాల్సిన అవసరం లేదని అన్నాడు. సరైన సన్నద్ధత లేదని ఎలా చెప్పగలరంటూ ప్రశ్నించాడు.
తుది జట్టు (అంచనా) - యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్, నితీశ్ కుమార్ రెడ్డి, అశ్విన్, సిరాజ్, ఆకాశ్ దీప్, జస్‌ప్రీత్ బుమ్రా (కెప్టెన్)
బోర్డర్ గావస్కర్ ట్రోఫీ - ఆసీస్ గడ్డపై కోహ్లీ, రోహిత్ రికార్డులు ఎలా ఉన్నాయంటే?