తెలంగాణ

telangana

సూపర్ 8లో విండీస్​కు షాక్- గ్రాండ్ విక్టరీ కొట్టిన ఇంగ్లాండ్ - T20 World Cup 2024

By ETV Bharat Telugu Team

Published : Jun 20, 2024, 9:28 AM IST

Updated : Jun 20, 2024, 9:53 AM IST

WI vs Eng T20 Wolrd Cup 2024: 2024 టీ20 వరల్డ్​కప్​ సూపర్- 8లో ఆతిథ్య వెస్టిండీస్​కు ఇంగ్లాండ్ గట్టి షాక్ ఇచ్చింది. 181 పరుగుల భారీ లక్ష్యాన్ని 17.3 ఓవర్లలోనే ఛేదించి గ్రాండ్ విక్టరీ కొట్టింది.

WI vs Eng T20 Super 8
WI vs Eng T20 Super 8 (Source: Associated Press)

WI vs Eng T20 Wolrd Cup 2024:2024 టీ20 వరల్డ్​కప్​ సూపర్- 8లో ఇంగ్లాండ్ ఘనంగా బోణీ కొట్టింది. గురువారం వెస్టిండీస్​తో జరిగిన మ్యాచ్​లో ఇంగ్లాండ్ 8 వికెట్ల తేడాతో నెగ్గింది. ఆతిథ్య విండీస్ నిర్దేశించిన 181 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ 2 వికెట్లు కోల్పోయి 17.3 ఓవర్లలోనే ఛేదించింది. ఫిలిప్​ సాల్ట్ (87* పరుగులు), జాని బెయిర్ స్టో (48* పరుగులు) మెరుపు ఇన్నింగ్స్​తో అదరగొట్టారు. విండీస్ బౌలర్లలో రోస్టన్ ఛేజ్, రస్సెల్ తలో వికెట్ దక్కించుకున్నారు. మెరుపు ఇన్నింగ్స్​తో అలరించిన సాల్ట్​కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది.

181 పరుగుల భారీ లక్ష్య ఛేదనను డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ ఘనంగా ఆరంభించింది. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ ఆరంభం నుంచే బౌండరీలతో విరుచుకుపడ్డాడు. మరోవైపు జాన్ బట్లర్ (25 పరుగులు) భారీ షాట్లకు పోకుండా కాసేపు సాల్ట్​కు సహకారం అందించాడు. 7.4వద్ద బట్లర్ ఎల్​బీడబ్ల్యూగా ఔటయ్యాడు. వీరిద్దరు తొలి వికెట్​కు 67 పరుగులు జోడించారు. ఇక వన్​డౌన్​లో వచ్చిన మొయిన్ అలీ (13 పరుగులు) పెద్దగా ప్రభావం చూపలేదు. అతడు రస్సెల్ బౌలింగ్​లో పెవిలియన్ చేరాడు.

అప్పటికి ఇంగ్లాండ్ 10.1 ఓవర్లకు 84-2తో ఉంది. ఇక అప్పుడు క్రీజులోకి వచ్చిన బెయిర్ స్టో, సాల్ట్​లో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. బెయిర్ స్టో, సాల్ట్​కు సహకారం అందిస్తూ బౌండరీల మోత మోగించాడు. అటు 16వ ఓవర్లో సాల్ట్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. రొమారియో షెపర్డ్​ వేసిన ఆ ఓవర్లో సాల్ట్ 4,6,4,6,6,4తో 30 పరుగులు పిండుకున్నాడు. దీంతో సమీకరణం 24 బంతుల్లో 10 పరుగులుగా మారింది. ఒక్క ఓవర్​తో మ్యాచ్ స్వరూపం మారిపోయింది.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. జాన్సన్ చార్లెస్ (38 పరుగులు: 34 బంతుల్లో), పావెల్ (36 పరుగులు: 17 బంతుల్లో), రూథర్‌ఫర్డ్ (28* పరుగులు: 15 బంతుల్లో) రాణించారు. అయితే విండీస్​కు దక్కిన ఆరంభం చూస్తే, స్కోర్ 200+ దాటేలా కనిపించింది. విండీస్ 10 ఓవర్లకు 82-0తో పటిష్ఠంగా నిలిచింది. కానీ, ఆ తర్వాత ఇంగ్లాండ్ పుంజుకుంది. కట్టుదిడ్డంగా బంతులేస్తూ విండీస్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టింది. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్, జోఫ్రా ఆర్చర్, మొయిన్ అలీ, లియామ్ లివింగ్​స్టోన్ తలో వికెట్ దక్కించుకున్నారు.

ఆసీస్​దే ఆల్​రౌండర్​ పొజిషన్​ - ఐసీసీ ర్యాంకింగ్స్​లో హార్దిక్​ ఏ ప్లేస్​లో ఉన్నాడంటే?

విలియమ్సన్ షాకింగ్ డెసిషన్- T20 ప్రపంచకప్​ ప్రదర్శనే కారణం! - T20 World Cup 2024

Last Updated : Jun 20, 2024, 9:53 AM IST

ABOUT THE AUTHOR

...view details