Ind vs Sa World Cup Final:2024 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ సమరానికి సర్వం సిద్ధమైంది. వెస్టిండీస్ బర్బడోస్ వేదికగా శనివారం భారత్- సౌతాఫ్రికా జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. దీంతో యావత్ భారతదేశంలో ఫైనల్ మ్యాచ్ ఫీవర్ మొదలైపోయింది. 11ఏళ్ల నిరీక్షణకు తెర దించుతూ టీమ్ఇండియా ఐసీసీ ట్రోఫీని ముద్దాడాలని యావత్ క్రికెట్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆనేక రకాలుగా రోహిత్ సేనకు మద్దతు తెలుపుతున్నారు.
బుల్లి క్రికెట్ ఫ్యాన్స్ విషెస్:కర్ణాటక, హబ్బళ్లిలోని చిన్నారులు టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు ముందు టీమ్ఇండియాకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. 'జీతేగా బై జీతేగా ఇండియా జీతేగా. ఆల్ ది బెస్ట్ ఇండియా అంటూ' బుజ్జి క్రికెట్ ఫ్యాన్స్ హుషారుగా టీమ్ఇండియాను విష్ చేశారు.
ప్రత్యేక పూజలు:ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్, కాన్పుర్‌లో భారత్ విజయాన్ని కాంక్షిస్తూ పూజలు నిర్వహించారు. ప్రయాగ్‌రాజ్‌లోని గంగా నది ఒడ్డున ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫొటోలు, జాతీయ జెండాలు పట్టుకొని 'జై హింద్' అంటూ నినాదాలు చేశారు. ఓ క్రికెట్ ఫ్యాన్ ఏకంగా రోహిత్ శర్మ ఫొటో ఫ్రేమ్‌ను ఏకంగా వినాయక మందిరంలోకి తీసుకేళ్లి అర్చన చేయించారు.
పెయింటింగ్:ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన జుహెబ్ ఖాన్ టీమ్ఇండియాకు వినూత్నంగా విషెస్ చెప్పాడు. గోడపై 8 ఫీట్ల ఎత్తైన రోహిత్ శర్మ స్కెచ్ వేశాడు. బెస్ట్ ఆఫ్ లక్ టీమ్ఇండియా అని రాసి, టీ20 వరల్డ్‌కప్ ట్రోఫీని కూడా గీశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
మ్యాచ్ వర్షం కారణంగా వాషౌట్ అయితే-ఈ ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. అందుకే ఈ మ్యాచ్‌కు రిజర్వే డే ఉంది. నేడు వర్షం కారణంగా పూర్తిగా మ్యాచ్ మొదలు కాకపోతే రిజర్వ్ డే ఆదివారం మ్యాచ్‌ను నిర్వహిస్తారు. ఒకవేళ మ్యాచ్ మొదలై ఆగిపోతే ఎక్కడైతే మ్యాచ్ ఆగిందో అక్కడి నుంచే ఆదివారం ఆటను తిరిగి కొనసాగిస్తారు. అదే శనివారం టాస్ పడ్డాక వర్షం వల్ల మ్యాచ్ ప్రారంభం అవ్వకపోతే మళ్లీ రిజర్వ్‌డే ఆదివారం రోజు టాస్ నిర్వహిస్తారు.
ఈ మ్యాచ్ ఫలితాన్ని తేల్చేందుకు ఐసీసీ అదనంగా 190 నిమిషాలు సమయం కూడా కేటాయించింది. ఈ అదనపు సమయం మ్యాచ్ జరగాల్సిన రోజుతో పాటు రిజర్వ్‌డేకు కూడా వర్తిస్తుంది. అదే రిజర్వ్‌డే రోజు కూడా ఆట సాధ్యం కాకపోతే రెండు జట్లను ఉమ్మడి విజేతలుగా అనౌన్స్ చేస్తారు. ఒకవేళ డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో విన్నర్‌ను అనౌన్స్ చేయాల్సి వస్తే ఇరు జట్లు కనీసం 10 ఓవర్లు అయినా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది.
టీమ్ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా రికార్డ్స్ - ఇప్పటివరకు ఎవరిది పైచేయి అంటే? - T20 Worldcup 2024 Final
రోహిత్‌సేనకు సువర్ణావకాశం - అతడొక్కడు ఫామ్‌లోకి వస్తే కప్ మనదే! - T20 Worldcup 2024 Final