తెలంగాణ

telangana

ETV Bharat / sports

రంజీ ట్రోఫీ ఎప్పుడు మొదలైంది? అసలా పేరు ఎలా వచ్చిందంటే? - Ranji Trophy History

Ranji trophy History : బీసీసీఐ ప్రతి ఏటా ప్రతిష్ఠాత్మకంగా రంజీ ట్రోఫీని నిర్వహిస్తుంటుంది. అందులో గెలవాలని దేశవాళి జట్లు తీవ్రంగా పోరాడుతాయి. మరి ఈ రంజీ ట్రోఫీ ఎప్పుడు మొదలైంది? అసలా పేరు ఎలా వచ్చింది? దాని వెనుక ఉన్న చరిత్ర ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

source IANS
RANJIT SINGH Ranji trophy History (source IANS)

By ETV Bharat Sports Team

Published : Sep 10, 2024, 6:20 PM IST

Ranji trophy History :క్రికెట్​ను ఒక మతంగా భావించే భారత్​లో రంజీ ట్రోఫీకి దాదాపు శతాబ్దం చరిత్ర ఉంది. ఏ క్రికెటర్‌ అయినా తన ఆటను ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్​తోనే మొదలు పెడతారు. ఐపీఎల్‌ రాకముందు రంజీ ట్రోఫీలాంటి దేశవాలీ టోర్నీల్లో ప్రతిభ ఆధారంగానే టీమ్​ఇండియా ఆటగాళ్లను ఎంపిక చేసేవారు. మరి అంతటి చరిత్ర కలిగిన రంజీ ట్రోఫీ పుట్టుక ఎలా జరిగిందనేది కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.

ప్రస్తుత తరంవారికి క్రికెట్ అంటే సునీల్ గావస్కర్, సచిన్ తెందూల్కర్, కపిల్ దేవ్, విరాట్ కోహ్లీ వంటి ప్లేయర్లు గుర్తుకొస్తారు. అంతలా ఈ క్రీడాకారులు యువతరానికి స్ఫూర్తినిచ్చారు. వీరెవరూ భారత క్రికెట్​కు పితామహులు కాదు. ఇంతకీ భారత క్రికెట్ పితామహుడు ఎవరు? రంజీ ట్రోఫీకి ఆ పేరు ఎలా వచ్చింది? తదితర విషయాలు చూద్దాం.

భారత క్రికెట్ పితామహుడు -క్రికెట్ ఇంగ్లాండ్​లో పుట్టింది. అయితే శ్వేత జాతీయుల ఆటగా మొదట పేరొందిన క్రికెట్​ను భారత్​కు పరిచయం చేసింది రంజిత్ సింగ్ కుమార్. అందుకే అతడి పేరు మీదుగా రంజీ ట్రోఫీని పెట్టారు. ఇప్పటికీ ఈ ట్రోఫీ కొనసాగుతోంది. రంజిత్ కుమార్ తన ఆటతో బ్రిటిషర్లను సైతం ఆకట్టుకున్నాడు. అందుకే అతడిని భారత క్రికెట్​కు పితామహుడిగా అభివర్ణిస్తారు. భారత క్రికెట్ ఆరంభాన్ని పరిశీలిస్తే అప్పట్లో మహారాజులు, యువరాజులు, నవాబుల ఈ ఆటను ఆడేవారు. ఆ తర్వాతి కాలంలో సామాన్యులు సైతం క్రికెట్ ఆడడం మొదలుపెట్టారు.

రంజిత్ సింగ్ ఎవరు? -రంజిత్ సింగ్ 1872 సెప్టెంబర్ 10న ఒక రైతు కుటుంబంలో జన్మించాడు. అతడి కుటుంబనికి నవనగర్ రాజు బీభా సింగ్​తో సంబంధాలు ఉన్నాయి. బీభా సింగ్‌ వారసుడిగా రంజీత్ సింగ్​ 1978లో ఎంపికయ్యాడు. ఆ తర్వాత రాజుగా బాధ్యతలు చేపట్టాడు. ఆ తర్వాత 16 ఏళ్ల వయసులో చదువు కోసం రంజీత్ సింగ్ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి వెళ్లాడు. అక్కడ క్రికెట్ పట్ల ఉన్న ఆసక్తితో ససెక్స్, లండన్ కౌంటీలకు ఆడాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియాతో జరిగిన యాషెస్ సిరీస్​లో ఓ టెస్టు మ్యాచ్ ఆడాడు.

అంత ఈజీగా చోటు దక్కలేదు! -అయితే రంజీత్ సింగ్​కు అంత ఈజీగా ఇంగ్లాండ్ జట్టులో చోటు దక్కలేదు. స్వాతంత్య్రానికి ముందు భారతీయులను బ్రిటీషర్లు నల్లజాతీయులుగా భావించేవారు. అందుకే బ్రిటీష్ జట్టులో స్థానం కోసం రంజీత్ సింగ్ చాలా కష్టపడ్డాడు. ఎట్టకేలకు తన ప్రతిభతో ఇంగ్లాండ్ జట్టులో స్థానం దక్కించుకున్నాడు. చివరికి ఓల్డ్ ట్రాఫోర్డ్​లో తన రెండో టెస్టు ఆడాడు. మూడో స్థానంలో బ్యాటింగ్​కు వచ్చిన రంజిత్ సింగ్ తొలి ఇన్నింగ్స్​లో హాఫ్ సెంచరీ, రెండో ఇన్నింగ్స్​లో సెంచరీ బాదాడు. ఆ తర్వాత రంజిత్ సింగ్ పేరు మార్మోగిపోయింది. తనదైన స్టైల్​లో లైగ్ సైడ్ షాట్లను కొడుతూ రంజిత్ మంచి పేరు సంపాదించుకున్నాడు.

భారత్ తరఫున ఎందుకు ఆడలేదంటే? -ఇంగ్లాండ్​ తరఫున ఆడిన రంజిత్ సింగ్ 15 టెస్టుల్లో 989 పరుగులు చేశాడు. అలాగే ఫస్ట్ క్లాస్ కెరీర్​లోనూ అదరగొట్టాడు. 307 మ్యాచుల్లో 24,692 పరుగులు చేశాడు. అందులో 72 సెంచరీలు, 109 అర్ధ శతకాలు ఉన్నాయి. అయితే భారత్ లో రంజిత్ సింగ్ ప్రొఫెషనల్ క్రికెట్ ఆడలేదు. ఎందుకంటే అప్పటికే భారత్​కు టెస్టు జట్టు లేదు. 1932లో భారత్ టెస్టు మ్యాచులు ఆడింది.

కాగా, 1933లో రంజిత్ సింగ్ ప్రాణాలు విడిచాడు. ఆ తర్వాత ఏడాది అంటే 1934లో బీసీసీఐ 'ఇండియన్ క్రికెట్ ఛాంపియన్‌ షిప్' అనే టోర్నమెంట్​ను ప్రారంభించింది. 1935లో ఆ ట్రోఫీకి రంజిత్ సింగ్ పేరు మీదుగా రంజీ ట్రోఫీని అని పేరు పెట్టింది.
ఒకేసారి ఇద్దరు హీరోయిన్లతో శుభమన్​ గిల్ డేటింగ్! - ఫొటోస్ వైరల్ - Shubman Gill Dating with Heroines

క్యాన్సర్​ను జయించిన క్రీడాకారులు - మైదానంలోనే కాదు, నిజ జీవితంలోనూ హీరోలే! - SPORTS PERSONS FOUGHT WITH CANCER

ABOUT THE AUTHOR

...view details