HYDRA Ranganath On Geosmartindia : జియో సైన్స్ ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. పారిశ్రామిక రంగాలతో పాటు ప్రభుత్వాలకు ఈ జియో స్పేషియల్ టెక్నాలజీ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. హైదరాబాద్ హైటెక్స్‌లో జరిగిన 'జియో స్మార్ట్ ఇండియా' రెండో సదస్సులో ఆయన మాట్లాడారు. శాటిలైట్ మ్యాప్ డేటా బేస్ ద్వారా చెరువులను గుర్తించి హైడ్రా వాటిని కాపాడుతుందని తెలిపారు. మ్యాప్ ద్వారా ఆక్రమణలను గుర్తించి తొలగిస్తున్నామని చెప్పారు. నగరంలో చెరువుల సంరక్షణ కోసం కొంత మందికి ఇబ్బంది అయినా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. నాళాలు ఆక్రమణకు గురై వాటి మధ్య ఇంటర్ కనెక్టివిటీ పోయి వ్యర్థ జలాలు చెరువులలో కలుస్తున్నాయన్నారు. జియో స్పెషియల్ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగమని తెలిపారు.
కొందరు ఇబ్బంది పడినా కఠిన నిర్ణయాలు తప్పవు : హైడ్రా కమిషనర్
హైదరాబాద్ హైటెక్స్‌లో జియో స్మార్ట్ ఇండియా రెండో సదస్సు - ప్రభుత్వాలకు జియో స్పేషియల్ టెక్నాలజీ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
Published : 16 hours ago