ETV Bharat / sports

విరాట్ కోహ్లీకి గాయం? - ఆందోళనలో ఫ్యాన్స్​! - IND VS AUS KOHLI INJURED

ఆసీస్‌తో రెండో టెస్టుకు ముందు మోకాలికి బ్యాండేజీ వేసుకుని ప్రాక్టీస్ చేసిన విరాట్ కోహ్లీ.

IND VS AUS 2nd Test Kohli Injured
IND VS AUS 2nd Test Kohli Injured (source Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Dec 3, 2024, 7:56 PM IST

IND VS AUS 2nd Test Kohli Injured : టీమ్ ఇండియా - ఆస్ట్రేలియా మధ్య మధ్య డిసెంబర్ 6 నుంచి అడిలైడ్‌ వేదికగా రెండో టెస్టు మొదలు కానుంది. ఈ మ్యాచ్‌ కోసం ఇప్పటికే అడిలైడ్ చేరుకున్న భారత జట్టు ప్రాక్టీస్‌లో నిమగ్నమైంది. అయితే ఇప్పుడు టీమ్ ఇండియాతో పాటు కోహ్లీ ఫ్యాన్స్​కు ఆందోళన కలిగించే విషయం ఒకటి బయటకు వచ్చింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మోకాలికి బ్యాండేజీ వేసుకుని, ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. విరాట్​ రెండో టెస్టులో ఆడతాడా? లేదా అని అభిమానులు తెగ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రాక్టీస్ సెషన్‌లో కోహ్లీ కుడి కాలు మోకాలి నొప్పితో కాస్త ఇబ్బంది పడినట్లు సమాచారం అందుతోంది. దీంతో మెడికల్ టీమ్ వచ్చి కోహ్లీకి చికిత్స చేసి అనంతరం మోకాలికి బ్యాండేజీ వేసినట్లు తెలిసింది.

ఒక వేళ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌కు దూరమైతే అది భారత జట్టుకు పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పాలి. ఎందుకంటే అడిలైడ్‌ స్టేడియంలో విరాట్ కోహ్లీకి మంచి అద్బుతమైన రికార్డు ఉంది. టెస్టుల్లో అతడు ఇక్కడ 8 ఇన్నింగ్స్‌ల్లో 63.62 యావరేజ్​తో 509 పరుగులు చేశాడు. 2014లో జరిగిన మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో 115, సెకండ్ ఇన్నింగ్స్‌లో 141 పరుగులు సాధించాడు.

డబ్ల్యూటీసీ ఫైనల్ రేస్​ - టీమ్​ఇండియాకు గుడ్​న్యూస్​, న్యూజిలాండ్​కు ఎదురుదెబ్బ!

భార్యతో కలిసి ధోనీ డ్యాన్స్‌ - మిస్టర్ కూల్ స్టెప్పులు సూపర్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.