Gambhir Fight with Truck Driver :తన కెరీర్లో ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి వార్తల్లో నిలిచిన టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, వివాదాలతోనూ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. మెంటార్‌గా ఉన్న సమయంలోనూ పలు కాంట్రవర్సీలతో వార్తల్లో నిలిచాడు. అయితే తాజాగా గంభీర్ గురించి మరో ఆసక్తికరమైన విషయాన్ని టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా పంచుకున్నాడు. రోడ్డుపై ట్రక్ డ్రైవర్‌తో గంభీర్ గొడవ పడిన సంఘటన గురించి ఓ పాడ్ కాస్ట్లో చెప్పాడు. గంభీర్‌కు త్వరగా కోపం వస్తుందని, అలాగే లోతైన భావోద్వేగంతో ఉంటాడని తెలిపాడు. ఇంకా గౌతీ గురించి ఏమన్నాడంటే?
"ఒకప్పుడు దిల్లీలో గౌతమ్ గంభీర్ ట్రక్ డ్రైవర్‌తో గొడవపడ్డాడు. కారులో నుంచి దిగి, ట్రక్ పైకి ఎక్కి డ్రైవర్ కాలర్ పట్టుకున్నాడు. ట్రక్ డ్రైవర్ రాంగ్ టర్న్ చేశాడు. అంతేగాక గంభీర్‌ను దుర్భాషలాడాడు. దీంతో గంభీర్‌కు కోపం వచ్చి అలా చేశాడు. గంభీర్ కాస్త సీరియస్‌గా ఉంటాడు. కానీ ఎన్నో పరుగులు చేశాడు. బాధ్యతలను భుజాలపై వేసుకుని ఎప్పుడూ ఆడతాడు. నేను, గంభీర్ మంచి స్నేహితులం కాదు. ఎందుకంటే ఇద్దరం దిల్లీ తరఫున ఆడేటప్పుడు ఓపెనర్ స్థానం కోసం తీవ్రంగా పోటీ పడేవాళ్లం." అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.
'మంచి స్నేహితులం కాదు'
ఆకాశ్ చోప్రా, గంభీర్ ఇద్దరూ దేశవాళీ క్రికెట్లో దిల్లీ జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. ఈ నేపథ్యంలో వారిద్దరూ దిల్లీ, టీమ్ ఇండియాలో ఓపెనింగ్ స్థానం కోసం తీవ్రంగా పోటీపడేవారు. దీంతో గంభీర్, తాను మంచి స్నేహితులం కాలేకపోయామని ఆకాశ్ చోప్రా వెల్లడించాడు. గంభీర్, తాను కలిసి ఆడే సమయంలో దిల్లీ జట్టు చాలా బలంగా ఉండేదని చెప్పుకొచ్చాడు. టీమ్ ఇండియా దిగ్గజ ప్లేయర్లు కోహ్లీ, ధావన్‌లలో ఒకరి మాత్రమే జట్టులో అవకాశం వచ్చేదని వివరించాడు. వీరేంద్ర సెహ్వాగ్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ వస్తే, ధావన్ లేదా కోహ్లీని మూడో ప్లేస్ లో బ్యాటింగ్ పంపేవాళ్లమని వెల్లడించాడు.
గంభీర్ విషయానికొస్తే
ఇక గంభీర్ విషయానికొస్తే టీమ్ ఇండియా ప్రధాన కోచ్‌గా ఉన్నాడు. శ్రీలంక పర్యటనలో కోచింగ్ బాధ్యతలు అందుకున్న గంభీర్‌కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. లంకపై టీ20 సిరీస్ గెలిచిన టీమ్ ఇండియా, వన్డే సిరీస్‌ను చేజార్చుకుంది. దీంతో సెప్టెంబరు 19 నుంచి బంగ్లాదేశ్‌తో ప్రారంభం కానున్న టెస్టు సిరీస్ పై గంభీర్ దృష్టి సారించాడు. గంభీర్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇదే మొదటి టెస్ట్ సిరీస్ కావడం.
ఖరీదైన బ్యాట్లు వాడుతున్న క్రికెటర్లు- ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! - Expensive Cricket Bats
ప్రాక్టీస్ సెషన్లోనూ విరాట్ మార్క్- కొడితే గోడ బద్దలైంది! - Virat Kohli Practice Session