తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPLలో 973 పరుగుల ఘనత - రానున్న సీజన్​లో విరాట్ బ్రేక్ చేస్తాడా? - VIRAT KOHLI IPL 2025 RECORD

ఐపీఎల్​లో ఒక సీజన్​లో అత్యధిక పరుగులు(973) చేసిన ఘనత విరాట్ కోహ్లీ పేరిట ఉంది. అయితే ఆ రికార్డును వచ్చే ఐపీఎల్ సీజన్​లో కోహ్లీ బద్దలు కొట్టడానికి ఉన్న అవకాశాలు ఏంటో తెలుసుకుందాం.

Virat Kohli IPL 2025 Record
Virat Kohli (Getty Images)

By ETV Bharat Sports Team

Published : Oct 8, 2024, 8:49 AM IST

Virat Kohli IPL 2025 Record :టీమ్ ఇండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ఫార్మాట్ తో సంబంధం లేకుండా పరుగుల వరద పారిస్తుంటాడు. వన్డే, టీ20, టెస్టులాంటి ఫార్మాట్లలో శైలి మార్చుకుంటూ అదరగొడుతుంటాడు. ఇటీవలే జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కఫ్ ఫైనల్ మ్యాచ్ తర్వాత అంతర్జాతీయ టీ20 ఫార్మాట్ కు గుడ్ బై చెప్పాడు. ప్రస్తుతం వన్డే, టెస్టుల్లోనే టీమ్ ఇండియా తరఫున కొనసాగుతున్నాడు.

ఆ రికార్డు బద్దలయ్యేనా?
అయితే టీమ్​ఇండియా తరఫునే కాకుండా ఐపీఎల్​లోనూ ఆర్​సీబీ తరఫున నిలకడగా రాణిస్తున్నాడు కింగ్ కోహ్లీ. ఆ ఫ్రాంచైజీ తరఫున ఐపీఎల్ 2016 సీజన్ లో ఏకంగా 973 పరుగుల బాది రికార్డు సృష్టించాడు. అయితే రానున్న సీజన్​లో ఆ రికార్డును కోహ్లీ బద్దలు కొడతాడా లేదా అనే ఆసక్తి క్రికెట్ ప్రియుల్లో నెలకొంది. అయితే కోహ్లీ రానున్న ఐపీఎల్​లో పరుగుల వరద పారించేందుకు రెండు బలమైన కారణాలు ఉన్నాయి. అవేంటంటే?

టీ20 ఫార్మాట్​కు రిటైర్మెంట్
ఇటీవలే టీ20 ఇంటర్నేషనల్స్​కు విరాట్ కోహ్లీ వీడ్కోలు పలికాడు. దీంతో పొట్టి ఫార్మాట్​లో టీమ్​ఇండియాకు ప్రాతినిధ్యం వహించడం, నిలకడగా రాణించడం వంటి ఒత్తిడి తగ్గుతుంది. అప్పుడు ఐపీఎల్​పై ఎక్కువ దృష్టి సారించవచ్చు. ఈ క్రమంలో దూకుడుగా బ్యాటింగ్ చేసి కోహ్లీ పరుగుల వరద పారించే అవకాశం ఉంది.

ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి కింగ్ కోహ్లీ ఆర్​సీబీ తరఫున ఆడుతున్నాడు. ఒక్కసారి విజేతగా నిలపకపోయినా, కోహ్లీపై ఆర్​సీబీ ఫ్రాంచైజీ యాజమాన్యం నమ్మకం పెట్టుకుంది. అంతర్జాతీయ టీ20లకు కోహ్లీ వీడ్కోలు పలకడం వల్ల, ఇక ఐపీఎల్ పైనే దృష్టి పెట్టి అదరగొట్టే అవకాశం ఉంది.

ట్రోఫీ కోసం పోరాటం
ఐపీఎల్ ప్రారంభ సీజన్ (2008) నుంచి ఆర్​సీబీ తరఫున విరాట్ కోహ్లీ ఆడుతున్నాడు. చాలా సీజన్లలో ఆ జట్టుకు కెప్టెన్​గానూ వ్యవహరించాడు. అయితే కోహ్లీ వ్యక్తిగతంగా రాణించినప్పటికీ, జట్టు వైఫల్యం వల్ల ఆర్​సీబీ ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీ అందుకోలేదు. అందుకే వచ్చే సీజన్​లో ఎలాగైనా ఆ జట్టుకు కప్పు అందించాలని విరాట్ భావిస్తున్నాడు.

అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్​ చెప్పిన కింగ్, ఐపీఎల్​పై దృష్టి సారించి విధ్వంసం సృష్టించే అవకాశాలు ఉన్నాయి. ఐపీఎల్ 2024 సీజన్​లో విరాట్ 741 పరుగులు చేశాడు. జట్టు విజయాల కోసం తీవ్రంగా కృషి చేశాడు. వచ్చే సీజన్​లో విరాట్ పరుగుల వరద పారిస్తాడని క్రికెట్ ప్రియులు ఆశిస్తున్నారు.

'టీమ్ఇండియాలో ఆ కసి పెంచాడు'- విరాట్ కెప్టెన్సీపై భజ్జీ ప్రశంసల వర్షం! - Harbajan Singh About Virat Kohli

బ్రాండ్ ఎండార్స్​మెంట్- ఫస్ట్ అండ్ కాస్ట్లీ డీల్- విరాట్, రోహిత్ ఎంత ఛార్జ్ చేస్తున్నారంటే? - Cricketer Brand Endorsement

ABOUT THE AUTHOR

...view details