Virat Kohli Century :టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి క్రికెట్లో సపరేట్ ఫ్యాన్‌బేస్ ఉంటుంది. కేవలం భారత్ నుంచే కాకుండా విరాట్‌కు వరల్డ్‌వైడ్‌గా కోట్లలో ఫ్యాన్స్ ఉంటారు. కింగ్ కోహ్లీ ఫ్యాన్‌బేస్‌కు లిమిట్స్ లేవు. దాయాది దేశం పాకిస్థాన్‌లోనూ విరాట్‌కు 'డై హార్డ్ ఫ్యాన్స్' ఉంటారు. ఛాంపియన్స్ ట్రోఫీలో తాజా మ్యాచ్‌తో అది మరోసారి నిరూపితం అయ్యింది. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో విరాట్ సెంచరీని ఆ దేశ అభిమానులు తెగ ఎంజాయ్ చేశారు.
దుబాయ్ వేదికగా ఆదివారం భారత్- పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇస్లామాబాద్‌లోని కొంతమంది అభిమానులు బిగ్ స్క్రీన్ ఏర్పాటు చేసుకొని లైవ్ మ్యాచ్ చూశారు.ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓడిపోతుందని అక్కడ కొంతమంది అభిమానులు నిరాశ చెందుతుంటే, మరికొందరు మాత్రం విరాట్ సెంచరీని సెలబ్రేట్ చేసుకున్నారు. అతడు సెంచరీ మార్క్ అందుకోగానే కేరింతలు, చప్పట్లు కొడుతూ సంబరాలు చేసుకున్నారు. 'కోహ్లీ', 'కోహ్లీ' అంటూ హుషారుగా అరుస్తూ సంబర పడిపోయారు.
నెటిజన్ల రియాక్షన్
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికి నెటిజన్లు స్పందిస్తున్నారు. పాకిస్థాన్‌లోని విరాట్ ఫ్యాన్స్ అతడి మాస్టర్ క్లాస్‌ను మెచ్చుకుంటున్నారని అన్నారు. ఇది 'బ్యూటీ ఆఫ్ క్రికెట్', క్రికెట్లో ఇది నిజమైన విజయం', 'ఒరిజినల్ కింగ్ ఎవరో వాళ్లకు తెలుసు' అంటూ కామెంట్లు చేస్తున్నారు.