Kohli Wrogn : టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్లు చాలా బ్రాండ్‌లకు ఎండార్స్ చేస్తుంటారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ అయితే ఎక్కువగా పెద్ద బ్రాండ్‌లతో కలిసి పని చేస్తుంటాడు. అలానే విరాట్‌కు సొంతంగా బిజినెస్‌లు కూడా ఉన్నాయి. వన్8, WROGN వంటి వాటిల్లోనూ అతడు పెట్టుబడులు పెట్టాడు. అయితే WROGN కంపెనీ 2024 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 29% ఆదాయం కోల్పోయినట్లు తెలిసింది. ప్రపంచంలోనే పాపులర్ క్రికెటర్, భారతదేశపు అత్యంత ప్రజాదరణ పొందిన బ్రాండ్ అంబాసిడర్‌లలో ఒకడైన కోహ్లీ ఎండార్స్ చేసినా ఈ ఫలితాలు రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. విరాట్‌కు భారీ క్రేజ్ ఉన్నప్పటికీ ఈ బ్రాండ్ విక్రయాలు తగ్గుముఖం పట్టడంతో, సవాళ్లను ఎదుర్కొంటోంది!
WROGN బ్రాండ్ టార్గెట్ ఆడియన్స్ ఎవరు?
మెన్స్ ఫ్యాషన్‌ను ఇది డిజైన్స్ చేస్తుంటుంది. ఇండియాలోని నగర, పట్టణ యువకులను లక్ష్యంగా చేసుకుని తమ ప్రాడెక్ట్స్‌ను మార్కెట్లోకి విడుదల చేస్తుంటుంది. అయితే ఫ్యాషన్ వేగంగా మారుతోంది. అందుకు తగ్గట్టుగా ఈ కంపెనీ దాని ప్రొడక్ట్‌లను డిజైన్ చేసి, మార్కెటింగ్ చేసుకోలేకపోయిందని ఇంగ్లీష్ మీడియాలో కథనాలు వచ్చాయి.
ఆర్థిక అంశాలు - కరోనా తర్వాత, చాలా మంది వ్యక్తులు WROGN వంటి లగ్జరీ లేదా ప్రీమియం బ్రాండ్‌లపై తక్కువ ఖర్చు చేస్తున్నారు. ఇది కూడా బ్రాండ్ అమ్మకాలను దెబ్బతీసి ఉండొచ్చని అంటున్నారు.