తెలంగాణ

telangana

ETV Bharat / sports

రెండో సారి తల్లిదండ్రులు కానున్న విరుష్క జంట - ఏబీడీ క్లారిటీ - Virat Kohli Second Baby

Virat Kohli England Series : టీమ్​ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్​ టెస్టులకు ఎందుకు దూరమయ్యారన్న విషయం గురించి చర్చలు జరుగుతున్న వేళ సౌతాఫ్రికా ప్లేయర్​ ఏబీ డివిలియర్స్‌ ఓ గుడ్​ న్యూస్​ను అభిమానులకు తెలియజేశారు.

Virat Kohli England Series
Virat Kohli England Series

By ETV Bharat Telugu Team

Published : Feb 3, 2024, 7:17 PM IST

Updated : Feb 3, 2024, 7:51 PM IST

Virat Kohli England Series : ప్రస్తుతం ఇంగ్లాండ్​తో జరుగుతున్న టెస్ట్ సిరీస్​కు విరాట్​ కోహ్లీ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే విరాట్ అలా మ్యాచ్​కు ఎందుకు దూరమయ్యాడన్న విషయంపై సౌతాఫ్రికా ప్లేయర్​ ఏబీ డివిలియర్స్‌ క్లారిటీ ఇచ్చాడు. విరుష్క దంపతులు రెండో సారి తల్లిదండ్రులు కానున్నారంటూ ఏబీడీ క్లారిటీ ఇచ్చాడు. తన ఫాలోవర్లతో జరిగిన క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్​లో దీని గురించి మాట్లాడాడు. అనుష్క ప్రెగ్నెంట్​గా ఉన్నందు వల్ల కోహ్లీ కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నాడని వెల్లడించాడు.

మరోవైపు ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి రెండు టెస్టుల నుంచి విరాట్ వ్యక్తిగత కారణాల వల్ల తప్పుకున్నాడు. ఇదే కారణం వల్ల గత నెలలో అఫ్గానిస్థాన్​తో జరిగిన తొలి టీ20కి కూడా దూరమయ్యాడు. అయితే కోహ్లీ ఇలా తరచూ క్రికెట్‌కు ఎందుకు బ్రేక్​ ఇస్తున్నాడన్న విషయం గురించి నెట్టింట తీవ్ర చర్చలు మొదలయ్యాయి.

ఈ నేపథ్యంలో విరుష్క జంట మరోసారి తల్లిదండ్రులు కానున్నారన్న రూమర్స్​ కూడా బయటకి వచ్చాయి. అయితే ఈ విషయంపై అటు విరాట్ కానీ ఇటు అనుష్క కానీ క్లారిటీ ఇవ్వలేదు. అనుష్క తన బేబీ బంప్‌తో కనిపించినప్పిటికీ అందరూ స్టార్ కపుల్ అఫీషియల్ అనౌన్స్​మెంట్​ కోసం వెయిట్​ చేశారు. అయితే ఇప్పుడు డివిలియర్స్ ఈ విషయాన్ని రివీల్​ చేయడం వల్ల విరుష్క జంట కూడా త్వరలో ఈ స్వీట్​ న్యూస్​ను తెలియజేస్తాంటూ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Virat Anushka Marriage : ఓ షాంఫూ యాడ్ షూటింగ్‌తో పరిచయమైన విరాట్, అనుష్క ఆ తర్వాత స్నేహితులయ్యారు. కొన్నేళ్లకు ఆ స్నేహబంధం కాస్త ప్రేమగా మారింది. అలా 5-6 ఏళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట 2017 డిసెంబరులో ఏడడుగల బంధంతో ఒక్కటయ్యారు. ఇటలీలోని టూస్కానీలో 800 ఏళ్ల నాటి వారసత్వ విల్లా వేదికగా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఇక 2021లో ఈ జంట వామికా అనే చిన్నారికి తల్లిదండ్రులయ్యారు.

ఆరో ఏడాదిలోకి 'విరుష్క' పెళ్లి బంధం- అనుష్కను కోహ్లీ ఎలా ఇంప్రెస్ చేశాడో తెలుసా?

'రెండు పెగ్గులేస్తే అనుష్క కంటే బాగా డ్యాన్స్ చేస్తా'.. ర్యాపిడ్ ఫైర్​లో కోహ్లీ ఆన్సర్​!

Last Updated : Feb 3, 2024, 7:51 PM IST

ABOUT THE AUTHOR

...view details