Virat Kohli Doppelganger Ayodhya :రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ వేడుకతో అయోధ్య మొత్తం రామ నామ స్మరణతో మార్మోగిపోతోంది. సోమవారం జరిగిన ఈ వేడుకకు హాజరై రామ్ లల్లాను తిలకించేందుకు ఎంతో మంది ప్రజలు బారులు తీరారు. అందులో సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఎంతో మంది సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకకు వచ్చారు. చిరంజీవి, రజనీకాంత్ రామ్ చరణ్, పవన్ కల్యాణ్, ఆలియా, రణ్‌బీర్ కపూర్ లాంటి సినీ స్టార్స్‌తో పాటు సచిన్, రవీంద్ర జడేజా,అనిల్‌కుంబ్లే ఈ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అయితే టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్‌కు మాత్రం నిరాశే మిగిలింది. వేడుకకు హాజరైన ప్రముఖులలో విరుష్క జంట కనిపించలేదు. అయితే కొన్ని కారణాల వల్ల వాళ్లిద్దరు అయోధ్యకు రాలేకపోయారట. దీంతో విరుష్క అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
టీమ్ఇండియా జెర్సీలో విరాట్ - అయోధ్య సన్నిధిలో సందడి !
Virat Kohli Doppelganger Ayodhya : అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఎంతో మంది ప్రముఖులు హాజరయ్యారు. ప్రస్తుతం వారికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ట్రెండ్ అవుతోంది. అయితే ఓ వీడియో మాత్రం క్రికెట్ లవర్స్ దృష్టిని ఆకర్షించింది. ఇంతకీ అదేంటంటే ?
Published : Jan 23, 2024, 9:38 AM IST
|Updated : Jan 23, 2024, 10:17 AM IST
అయితే తాజాగా విరాట్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అందులో అయోధ్య వీధుల్లో జెర్సీ ధరించి విరాట్ తిరుగుతున్నట్లు కనిపించింది. ఇక అభిమానులు కూడా విరాట్ అయోధ్యలో ఉన్నాడంటూ అతడ్నిచూసేందుకు వెళ్లారు. తీరా అక్కడ చూస్తే అది విరాట్ కాదు అతడి పోలికలతో ఉన్న ఓ వ్యక్తి. దీన్ని చూసి ఒక్కసారిగా అభిమానులు షాకయ్యారు. ఆ తర్వాత అతడితో సెల్ఫీలు దిగారు. మరోవైపు విరాట్‌తో పాటు సచిన్ పోలీకలతో ఉన్న మరో వ్యక్తి కూడా అయోధ్యలో కనిపించారు. ఆయన కూడా జెర్సీ ధరించి సందడి చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.
మరోవైపు విరాట్ కోహ్లీ 25 నుంచి హైదరాబాద్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగే 5 టెస్టుల సరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు వ్యక్తిగత కారణాలతో దూరంగా ఉండనున్నాడు. ఈ మేరకు బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. దీంతో ఇటీవలే హైదరాబాద్‌కు వచ్చిన అతడు తిరిగి ముంబయికి పయనమయ్యాడు.