తెలంగాణ

telangana

ETV Bharat / sports

విరాట్​ను ఎగతాళి చేసిన ఆ ప్లేయర్ - బ్లాక్​ చేసిన కోహ్లీ! - VIRAT KOHLI BLOCKED MAXWELL

ఆ ప్లేయర్​ను బ్లాక్ చేసిన టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ!

Kohli Blocked Maxwell
Kohli Blocked Maxwell (source Associated Press)

By ETV Bharat Sports Team

Published : Oct 29, 2024, 3:40 PM IST

Kohli Blocked Maxwell : టీమ్‌ ఇండియా స్టార్‌ ప్లేయర్​ విరాట్‌ కోహ్లీ, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ ఇండియన్ ప్రీమియర్ లీగ్​ ఐపీఎల్‌లో ఒకే జట్టుకు ఆడుతున్న సంగతి తెలిసిందే. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఆర్సీబీ తరఫున వీరిద్దరు ఆడుతున్నారు. వీరిద్దరి మధ్య మంచి స్నేహ బంధం ఉంది.

అయితే, మ్యాక్స్‌వెల్‌ తాజాగా ది షో మ్యాన్‌ అనే బుక్​ను రిలీజ్ చేశాడు. అందులో అతడు పంజాబ్‌ కింగ్స్‌కు కెప్టెన్‌గా ఉన్నప్పుడు జరిగిన వివాదంతో పాటు కోహ్లీని తనను బ్లాక్ చేసిన సంఘటనను రాసుకొచ్చాడు. దీంతో పాటే ఆర్సీబీ జట్టులోకి రావడానికి ఎవరు మద్దతు ఇచ్చారో చెప్పుకొచ్చాడు.

"నేను బెంగళురు జట్టుకు వెళ్తున్నానని తెలిసినప్పుడు, నన్ను టీమ్​లోకి స్వాగతించిన మొదటి వ్యక్తి కోహ్లీనే. ఐపీఎల్‌ సీజన్‌ ప్రారంభానికి ముందు ట్రైనింగ్​లో ఎన్నో విషయాల గురించి చర్చించుకున్నాం. అదే టైమ్​లో ఇన్‌స్టాలో విరాట్​ను ఫాలో అయ్యాను. అయితే అతడు తిరిగి నన్ను ఫాలో అవుతాడా లేదా అనే విషయాన్ని ఆ సమయంలో అంతగా పట్టించుకోలేదు. కానీ అతడికి సంబంధించిన పోస్ట్‌లు ఏమీ సోషల్‌ మీడియాలో కనిపించలేదు. మరి ఎందుకో నాకు అర్థం కాలేదు. విరాట్‌ నన్ను బ్లాక్‌ చేసి ఉంటాడని ఓ అతను నాతో చెప్పాడు. ఆస్ట్రేలియా, భారత్‌ పర్యటనకు వచ్చినప్పుడు కోహ్లీని ఎగతాళి చేసినందుకే అతడు నన్ను బ్లాక్‌ చేశాడని ఆ తర్వాత అర్థమైంది." అని ఆ బుక్​లో రాసుకున్నాడు మ్యాక్స్‌వెల్‌.

ఇంతకి అసలు ఏం జరిగిందంటే? - బోర్డర్ - గావస్కర్ సిరీస్‌లో భాగంగా 2017లో ఆసీస్​ జట్టు, భారత్‌లో పర్యటించింది. అప్పుడు రాంచీ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో మొదటి రోజు ఫీల్డింగ్ చేస్తునప్పుడు కోహ్లీ గాయపడ్డాడు. అప్పుడు మ్యాక్స్‌వెల్‌ విరాట్​ను ఎగతాళి చేశాడు. "ఆ తర్వాత ఓ సారి విరాట్ దగ్గరికి వెళ్లి, నన్ను ఇన్‌స్టాలో బ్లాక్‌ చేశావా అని అడిగాను. అప్పుడు కోహ్లీ స్పందిస్తూ 'టెస్ట్‌ మ్యాచ్‌లో నన్ను ఎగతాళి చేశావ్‌ కదా!, అందుకే బ్లాక్‌ చేశా అని చెప్పుకొచ్చాడు. అవును, మంచి పని చేశావ్‌. నేను అలా చేయకుండా ఉండాల్సిందిలే అని సమాధానమిచ్చాను. ఆ తర్వాత కోహ్లీ నన్ను అన్‌ బ్లాక్‌ చేశాడు. అప్పటి నుంచి ఇద్దరం మంచి స్నేహితులం అయ్యాం" అంటూ రాసుకొచ్చాడు మ్యాక్స్‌వెల్‌.

బోర్డర్ గావస్కర్ ట్రోఫీకి ముందే ఆసీస్​కు షాక్ - స్టార్ ప్లేయర్ రిటైర్మెంట్!

'పెనాల్టీ' రన్స్​ - కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ!

ABOUT THE AUTHOR

...view details