తెలంగాణ

telangana

ETV Bharat / sports

అంపైర్​పై కోహ్లీ మళ్లీ ఫైర్​ - ఈ సారి ఏం జరిగిందంటే? - IPL 2024

IPL 2024 RCB Kohli Fight with Umpire : విరాట్ కోహ్లీ మళ్లీ ఫైర్ అయ్యాడు. ఐపీఎల్ 2024లో భాగంగా తాజాగా జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ దిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌లో ఫీల్డ్ అంపైర్‌తో వాదన తారాస్థాయికి చేరింది. పూర్తి వివరాలు స్టోరీలో

The Associated Press
Kohli (The Associated Press)

By ETV Bharat Telugu Team

Published : May 13, 2024, 8:25 AM IST

IPL 2024 RCB Kohli Fight with Umpire :ఐపీఎల్ 2024లో భాగంగా జరిగిన బెంగళూరు వర్సెస్ దిల్లీ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఫైర్ అయ్యాడు. ఫీల్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వాదనకు దిగాడు. మొదట టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 188 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్య చేధనలో భాగంగా దిల్లీ క్యాపిటల్స్ తొలి ఓవర్లోనే డేవిడ్ వార్నర్ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత మొదటి ఓవర్లోనే వన్ డౌన్‌లో దిగిన అభిషేక్ పోరెల్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడంటూ బెంగళూరు రివ్యూ కోరింది.

మొహమ్మద్ సిరాజ్ విసిరిన స్వింగింగ్ యార్కర్‌ను ఎదుర్కొనేటప్పుడు పోరెల్ కాస్త వంగి ఆడటంతో స్టంప్స్ వైపుగా దూసుకొచ్చిన బంతి ప్యాడ్స్‌కు తగిలింది. అయితే బెంగళూరు కోరిన రివ్యూలో దిల్లీ క్యాపిటల్స్‌కు ఫేవర్‌గా డెసిషన్ రావడంతో బెంగళూరు కెప్టెన్ డుప్లెసిస్‌తో పాటు కోహ్లీ కూడా కాస్త నిరాశకు గురయ్యాడు. దాంతో ఫీల్డ్ అంపైర్​తో కొద్దిసేపటి వరకూ వాదిస్తూనే ఉన్నారు విరాట్, డుప్లెసిస్.

విరాట్ కోహ్లీకి అగ్రెసివ్ అవ్వడం కొత్తేం కాదు. ప్రత్యర్థి జట్ల కెప్టెన్లపైనా, కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్ గౌతం గంభీర్‌పైనా, స్టేడియంలో విసిగిస్తూ గ్రౌండ్ మధ్యలోకి వచ్చేసిన అభిమానులపైనా అసంతృప్తి వ్యక్తం చేస్తుంటాడు. దీంతో గ్రౌండ్‌లో అగ్రెసివ్‌గా పరుగులు తీస్తే ఓకే కానీ, నోరు పారేసుకుంటే మాత్రం కరెక్ట్ కాదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

కాగా, తొలి ఇన్నింగ్స్‌లో 20 ఓవర్లు ఆడి 9 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. లక్ష్య చేధనలో చతికిల బడిన ఢిల్లీ క్యాపిటల్స్ 19.1ఓవర్లలో 140 పరుగులకే ఆలౌట్ అయి చాప చుట్టేసింది. ఈ మ్యాచ్ ఫలితం తర్వాత దిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో 6వ స్థానంలోకి దిగజారగా, ఆర్సీబీ ఐదో స్థానానికి ఎగబాకింది. అంటే, బెంగళూరు జట్టుకు ఇంకా ప్లే ఆఫ్ ఆశలు సజీవంగానే ఉన్నాయన్నమాట. కాకపోతే బెంగళూరు ఇంకొక మ్యాచ్ గెలిస్తే, రన్ రేట్ ఆధారంగా ప్లేఆఫ్ రేసులో నిలబడే అవకాశముంది. ఇప్పటికే నాలుగో స్థానంలో, మూడో స్థానంలో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్‌లు మ్యాచ్‌లు ఓడి తక్కువ రన్ రేట్‌తో ఓడిపోతే మాత్రమే బెంగళూరుకు అవకాశం ఉంటుంది.

ABOUT THE AUTHOR

...view details