ETV Bharat / sports

మహిళల ఛాంపియన్‌షిప్‌ - భారత్‌ పరిస్థితేంటి? - ICC WOMENS CHAMPIONSHIP

మహిళల ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ విజేతగా ఆసీస్ - పాయింట్ల పట్టికలో భారత్ స్థానం ఎంతంటే?

ICC Womens Championship
ICC Womens Championship (source Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : 4 hours ago

ICC Womens Championship : ఐసీసీ మహిళల ఛాంపియన్‌షిప్‌ టైటిల్​ను ఆస్ట్రేలియా దక్కించుకుంది. న్యూజిలాండ్​తో జరిగిన మూడో వన్డేలో 75 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. దీంతో ఐసీసీ మహిళల ఛాంపియన్ షిప్ టైటిల్​ను ఆసీస్ దక్కించుకుంది. 24 మ్యాచుల ఐసీసీ ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక పాయింట్లు సాధించి మూడోసారి ఆసీస్‌ ఛాంపియన్​గా నిలిచింది. ఈ క్రమంలో పాయింట్ల పట్టికలో భారత్ ఎన్నో ప్లేస్​లో ఉంది? ఇతర జట్ల పరిస్థితి ఏంటి? తదితర విషయాలు తెలుసుకుందాం.

మూడో ప్లేస్​లో భారత్

ఐసీసీ మహిళల ఛాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో భారత్ మూడో స్థానానికి చేరుకుంది. విండీస్​పై తొలి వన్డేలో ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో భారత్ 24 మ్యాచుల్లో 15 విజయాలను నమోదు చేసి 32 పాయింట్ల సాధించింది. ఈ క్రమంలో పాయింట్ల పట్టికలో మూడో ప్లేస్​లో నిలిచింది.

మహిళల క్రికెట్​ను విస్తరించేందుకే!

మహిళా క్రికెట్​ను మరింత విస్తరించి అభివృద్ధి చేసేందుకు ఐసీసీ ప్రతి మూడేళ్ల సీజన్‌ కోసం వన్డే ఛాంపియన్‌షిప్‌ను నిర్వహిస్తోంది. ఈ ఛాంపియన్‌షిప్‌లో తొలి ఆరు స్థానాల్లో నిలిచిన జట్లు వన్డే ప్రపంచ కప్‌ టోర్నీకి నేరుగా క్వాలిఫై అవుతాయి. ఒకవేళ టాప్‌ -6లో లేకపోతే క్వాలిఫయర్‌ మ్యాచ్‌లను ఆడి అందులో అర్హత సాధిస్తే వరల్డ్ కప్ ఆడొచ్చు.

ప్రతి జట్టు 24 మ్యాచ్​లు ఆడాలి

ఈ సీజన్‌లో ప్రతి జట్టూ 24 వన్డేలు ఆడాల్సి ఉంటుంది. అందులో ఎక్కువ పాయింట్లు సాధించిన జట్టుకు ఛాంపియన్‌షిప్ టైటిల్‌ దక్కుతుంది. ఒక్కో మ్యాచ్‌ గెలిస్తే 2పాయింట్లు, ఎలాంటి ఫలితం రాకపోతే ఒక పాయింట్ ఆయా జట్లకు లభిస్తాయి.

తాజాగా జరిగిన మ్యాచ్​తో ఆసీస్‌ , న్యూజిలాండ్‌ తమ 24 వన్డేల కోటాను పూర్తి చేసుకున్నాయి. భారత్​కు ఇంకా 5, బంగ్లాకు 3, విండీస్ 5, ఐర్లాండ్​కు 3 మ్యాచ్‌లు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న పాయింట్ల ప్రకారం ఆసీస్​ను అధిగమించే అవకాశం మరే జట్టుకూ లేదు. దీంతో ఐసీసీ మహిళల ఛాంపియన్‌షిప్‌ టైటిల్ ఆసీస్ దక్కించుకుంది.

పాయింట్ల పట్టికలో టాప్‌ -6లో నిలిచిన టీమ్​లు

ఆస్ట్రేలియా 24 మ్యాచుల్లో 18 విజయాలు సాధించింది. మూడు మ్యాచుల్లో ఎలాంటి ఫలితం రాలేదు. ఓవరాల్ లో 39 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది.

ఇంగ్లాండ్ జట్టు 32 పాయింట్లతో రెండో ప్లేస్​లో ఉంది. 24 మ్యాచుల్లో 15 గెలుపొందింది. 7 మ్యాచుల్లో ఓడింది. రెండింట్లో ఎలాంటి ఫలితం రాలేదు.

భారత్‌ 27 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. 19 మ్యాచుల్లో 13 విజయాలు సాధించగా, ఐదు ఓడిపోయింది. ఒక మ్యాచ్‌ టైగా ముగిసింది.

దక్షిణాఫ్రికా 25 పాయింట్లతో నాలుగో ప్లేస్​లో నిలిచింది. 24 మ్యాచుల్లో 12గెలిచింది. 11 మ్యాచుల్లో ఓటమిపాలైంది.

శ్రీలంక 24 మ్యాచుల్లో 9 గెలిచింది. మరో 11 మ్యాచుల్లో ఓడింది. దీంతో 22 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది.

కివీస్ జట్టు 21 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. 24 మ్యాచ్ ల్లో 9 విజయాలు సాధించింది. 12 మ్యాచుల్లో ఓడింది.

బంగ్లాదేశ్‌ (19 పాయింట్లు), వెస్టిండీస్‌ (14 పాయింట్లు) వెనుకబడినప్పటికీ ఇంకా ఆ జట్లకు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఆ వన్డేలను అన్నింటిని గెలిస్తే టాప్‌ -6లోకి వచ్చే అవకాశం లేకపోలేదు. అప్పుడు శ్రీలంక, న్యూజిలాండ్‌కు ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది.

కివీస్​పై ఆసీస్ విజయం

కివీస్​తో జరిగిన మ్యాచులో ఆసీస్ 75రన్స్ తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 49 ఓవర్లలో 290 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. ఆసీస్ బ్యాటర్లలో అలెస్సా హెలీ(39), పోబి లిచ్ ఫీల్డ్(50), గార్డెనర్(74) రాణించారు. 291 పరుగుల లక్ష్య ఛేదనతో బ్యాటింగ్​కు దిగిన కివీస్ 215 పరుగులకే పరిమితమైంది. 43.3 ఓవర్లలోనే ఆలౌట్ అయ్యింది.

మను బాకర్‌కు దక్కని చోటు - 'ఖేల్‌ రత్న' నామినేషన్లపై మొదలైన వివాదం!

పాకిస్థాన్ వేదికగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ!- ఇక భారత్ మ్యాచ్​లన్నీ అక్కడేనా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.