ETV Bharat / sports

మను బాకర్‌కు దక్కని చోటు - 'ఖేల్‌ రత్న' నామినేషన్లపై మొదలైన వివాదం! - MANU BHAKER SNUBBED FROM KHEL RATNA

భారతావనికి స్వాతంత్య్రం వచ్చాక ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన ఏకైక అథ్లెట్ మను బాకర్ విషయంలో కొనసాగుతోన్న వివాదం. - అసలేం జరిగిందంటే?

Paris Olympics 2024 Manu Bhaker
Paris Olympics 2024 Manu Bhaker (source Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Dec 23, 2024, 3:27 PM IST

Paris Olympics 2024 Manu Bhaker : పారిస్ ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్​ సాధించి భారత పతాకాన్ని రెపరెపలాడించిన షూటర్‌ మను బాకర్. వ్యక్తిగత, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో మెడల్స్​ను సాధించి, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఒకే ఒలింపిక్స్‌లో రెండు పకకాలను అందుకున్న తొలి అథ్లెట్‌గా నిలిచింది. అయితే, తాజాగా ఖేల్ రత్న పురస్కారాల కోసం నామినేషన్ల జాబితాలో ఆమెకు స్థానం లభించలేదని ప్రచారం సాగుతోంది. ఇప్పుడీ విషయం క్రీడా వర్గంలో తీవ్ర చర్చకు దారి తీసింది.

తాజాగా మేజర్‌ ధ్యాన్‌ చంద్ ఖేల్‌రత్న అవార్డు కోసం కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ జాబితాను సిద్ధం చేసినట్లు సమాచారం అందింది. ఇందులోనే మను బాకర్‌ పేరు లేదని సోషల్ మీడియాలో కథనాలు కనిపిస్తున్నాయి. అయితే, అధికారిక వర్గం మాత్రం మను బాకర్ అసలు దరఖాస్తే చేయలేదని ఓ ప్రకటనను విడుదల చేసింది.

స్పందించిన మను బాకర్ తండ్రి - ఈ విషయంపై మను బాకర్ తండ్రి స్పందించారు. క్రీడా అత్యున్నత పురస్కారం కోసం తాము దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు. 12 మందితో కూడిన జాతీయ స్పోర్ట్స్‌ డే కమిటీ మాత్రం మను బాకర్‌కు అవకాశం ఇవ్వనట్లు తెలుస్తోంది.

"ఒకే ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్​ సాధించిన అథ్లెట్‌ కూడా అవార్డుల కోసం అడగాలా? ప్రభుత్వంలోని ఓ అధికారి నిర్ణయించారు. కమిటీ సభ్యులు సైలెంట్​గా ఉన్నారు. ఇదేనా మీరు అథ్లెట్లను ప్రోత్సహించే పద్ధతి? నాకు అస్సలు అర్థం కావడం లేదు. మేం మెడల్స్​ కోసం దరఖాస్తు చేశాం. కానీ, కమిటీ నుంచి ఎలాంటి ప్రతి స్పందన రాలేదు. ఇలాగైతే తమ పిల్లలను క్రీడల్లో పాల్గొనమని తల్లిదండ్రులు ఎలా ప్రోత్సహించగలరు? వారిని కూడా ఐఆర్‌ఎస్‌ లేదా ప్రభుత్వ ఉద్యోగిగా మారమని చెబుతారు" అని మను తండ్రి రామ్‌కిషన్‌ బాకర్‌ పేర్కొన్నారు. కాగా, మన బాకర్‌కు 2020లో అర్జున పురస్కారం దక్కింది.

షమీని గుర్తుచేస్తోన్న అభిమానులు - మను బాకర్ దరఖాస్తు చేయలేదని అధికారులు చెబుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో మహ్మద్ షమీ విషయాన్ని క్రీడా భిమానులు గుర్తు చేస్తున్నారు. షమీ దరఖాస్తు చేయకపోయినా ఈ ఏడాది అర్జున అవార్డుతో కేంద్రం సత్కరించిందని చెబుతున్నారు. గత వన్డే వరల్డ్ కప్‌లో టీమ్ ఇండియా ఫైనల్‌కు చేరడంలో కీలక పాత్ర పోషించడంతో పాటు క్రికెట్‌కు అందించిన సేవలకుగాను అతడికి పురస్కారం దక్కింది. ఇందుకోసం బీసీసీఐ ప్రత్యేకంగా సిఫార్సు చేసింది. ఇప్పుడు కూడా మను బాకర్‌ విషయంలోనూ షూటింగ్ సమాఖ్య ఇలాంటి చొరవే తీసుకోవాలనే డిమాండ్లూ వినిపిస్తున్నాయి.

కాగా, ప్రస్తుతానికి సోషల్ మీడియాలో కనిపిసోన్న జాబితా ప్రకారం, హాకీ ప్లేయర్ హర్మన్‌ప్రీత్ సింగ్, పారా అథ్లెట్‌ ప్రవీణ్ కుమార్‌ పేర్లు ఈ ఖేల్ రత్న పురస్కారాల నామినేషన్ల జాబితాలోఉన్నట్లు తెలుస్తోంది.

ఐపీఎల్‌లో అన్​సోల్డ్​ ప్లేయర్స్ - ఇతర లీగ్స్​లో సత్తా చాటాలనుకుంటున్న క్రికెటర్లు ఎవరంటే?

వాళ్లతో విరాట్​ను పోలుస్తుంటే నవ్వొస్తోంది! - ఈ జనరేషన్​లో బెస్ట్​ ప్లేయర్ అతడే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.