Vinod Kambli Health Condition : కొంతకాలంగా భారత మాజీ ఆటగాడు వినోద్ కాంబ్లీ (52) ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే శనివారం రాత్రి అతడి ఆరోగ్యం మరోసారి క్షీణించడంతో ఆస్పత్రిలో చేర్పించారు.
ఇటీవల శివాజీ పార్క్‌లో రమాకాంత్ అచ్రేకర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి కూడా కాంబ్లీ హాజరయ్యాడు. డిసెంబర్ 21న జరిగిన ఈ కార్యక్రమంలో కాంబ్లీ బానే ఉన్నాడు. అయితే హఠాత్తుగా ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రి పాలయ్యాడు. ప్రస్తుతం థానేలోని ఆకృతి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు.
సోమవారం (డిసెంబర్ 23)న అతడి ఆరోగ్యం కాస్త నిలకడగా ఉన్నట్లు తెలిసింది. అయితే ఇప్పటికీ అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. చికిత్సకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా, కాంబ్లీకి సాయం చేసేందుకు 1983 వన్డే వరల్డ్ కప్ విజేత టీమ్ సిద్ధంగా ఉందని మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఇటీవల ప్రకటించాడు. అయితే, ఒక షరతు విధించాడు. రిహాబిలిటేషన్ సెంటర్‌కు వెళ్తేనే సాయం చేస్తామన్నారు. దానికి వినోద్ కాంబ్లీ అంగీకరించారు. కాంబ్లీ, సచిన్ తెందూల్కర్ మంచి మిత్రులు. ఇంతకుముందు అతను అనారోగ్యానికి గురైనప్పుడు శస్త్ర చికిత్సలకు సచిన్ ఆర్థిక సాయం చేశారు.
మను బాకర్‌కు దక్కని చోటు - 'ఖేల్ రత్న' నామినేషన్లపై మొదలైన వివాదం!