Virat Kohli Anushka Sharma Son Name Meaning : టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ- భార్య అనుష్క శర్మ మరోసారి తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 15న అనుష్క పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు విరాట్ మంగళవారం స్వయంగా సోషల్ మీడియా ద్వారా చెప్పాడు. బాబుకు 'అకాయ్' (Akaay) అనే పేరు నామకరణం చేసినట్లు తెలిపాడు. ఈ సందర్భంగా కోహ్లీ - అనుష్క జంటకు ప్రముఖులు, అభిమానుల నుంచి సోషల్ మీడియా వేదికగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
అయితే అకాయ్ పేరుకు అర్థం ఏంటని సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. దీనిపై నాకరణం చేసే రంగం నిపుణుల వారు రెండు రకాల అర్థాలను చెబుతున్నారు. సంస్కృతంలో ఈ పదానికి అమరుడు, చిరంజీవుడు అనే అర్థం ఉందని తెలిపారు. అలాగే హిందీలో కాయ్ అంటే శరీరమని, అకాయ్ అంటే భౌతిక శరీరానికి మించినవాడు అని చెప్పారు. మరోవైపు టర్కీ భాషలో ఈ పదానికి ప్రకాశిస్తున్న చంద్రుడు అనే అర్థం కూడా ఉంటుందని వివరించారు. మరి విరుష్క జంట ఏ అర్థంలో తమ బిడ్డకు అకాయ్‌గా నామకరణం చేశారో వారే చెప్పాలి.
ఇకపోతే విరాట్ కోహ్లీ - అనుష్క శర్(Virat Kohli Anushka Sharma )మ జంటకు ఇప్పటికే మూడేళ్ల కుమార్తె వామిక ఉంది. "ఫిబ్రవరి 15న మా అబ్బాయి, వామిక తమ్ముడు అకాయ్‌ను ఈ ప్రపంచంలోకి ఆహ్వానించాము. ఈ విషయం అందరితో పంచుకోవడానికి సంతోషిస్తున్నాం. ఈ అందమైన సమయంలో మీ ఆశీర్వాదాలు మా అబ్బాయికి కావాలి. మా ఏకాంతాన్ని గౌరవించమని విజ్ఞప్తి చేస్తున్నాం" అని విరాట్ ఇన్స్టాలో రాసుకొచ్చాడు.