Vinod Kambli Health Condition : కొంతకాలంగా భారత మాజీ ఆటగాడు వినోద్ కాంబ్లీ (52) ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే శనివారం రాత్రి అతడి ఆరోగ్యం మరోసారి క్షీణించడంతో ఆస్పత్రిలో చేర్పించారు.
ఇటీవల శివాజీ పార్క్‌లో రమాకాంత్ అచ్రేకర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి కూడా కాంబ్లీ హాజరయ్యాడు. డిసెంబర్ 21న జరిగిన ఈ కార్యక్రమంలో కాంబ్లీ బానే ఉన్నాడు. అయితే హఠాత్తుగా ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రి పాలయ్యాడు. ప్రస్తుతం థానేలోని ఆకృతి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు.
సోమవారం (డిసెంబర్ 23)న అతడి ఆరోగ్యం కాస్త నిలకడగా ఉన్నట్లు తెలిసింది. అయితే ఇప్పటికీ అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. చికిత్సకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.