తెలంగాణ

telangana

ETV Bharat / sports

సాక్షి మాలిక్‌ సంచలన ఆరోపణలు - తిప్పికొట్టిన వినేశ్‌ ఫొగాట్‌! - VINESH PHOGAT ON SAKSHI MALIK

బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనలకు సంబంధించి సాక్షి మాలిక్‌ చేసిన ఆరోపణలను తిప్పి కొట్టిన వినేశ్‌ ఫొగాట్‌!

Sakshi Malik (Left), Vinesh Phogat (Right)
Sakshi Malik (Left), Vinesh Phogat (Right) (source ANI)

By ETV Bharat Sports Team

Published : Oct 22, 2024, 7:19 PM IST

Vinesh Phogat on Sakshi Maliks charge over wrestlers protest :మాజీ రెజ్లర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే వినేశ్‌ ఫొగాట్‌, రెజ్లర్ సాక్షి మాలిక్ చేసిన ఆరోపణలను తోసిపుచ్చింది. ఇటీవల విట్నెస్‌ పేరిట సాక్షి మాలిక్‌ విడుదల చేసిన పుస్తకంలో సంచలన ఆరోపణలు చేసింది. అందులో వినేశ్‌, బజరంగ్ పునియాకు సన్నిహితంగా ఉన్న కొంతమంది వారి మైండ్‌ను దురాశతో నింపారని పేర్కొంది. దీని కారణంగానే గతేడాది జాతీయ రెజ్లింగ్‌ సమాఖ్య (WFI) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసన బలహీనపడిందని ఆరోపించింది.

2023 ఆసియా క్రీడల ట్రయల్స్ నుంచి మినహాయింపును కోరాలని వినేశ్‌, బజరంగ్ తీసుకున్న నిర్ణయం తమ నిరసన ప్రతిష్టను దెబ్బతీసిందని సాక్షి మాలిక్ ఆరోపించింది. ఈ నిర్ణయం తర్వాత తమ పోరాటం 'స్వార్థపూరితమైనది'గా కనిపించిందని, బయటి ప్రభావాల కారణంగా నిరసనలో పగుళ్లు ఏర్పడ్డాయని తెలిపింది.

ఈ వ్యాఖ్యలపై వినేశ్‌ ఫొగట్‌ తీవ్రంగా స్పందించింది. 'దేని కోసం దురాశ? మీరు ఆమెను (సాక్షి మాలిక్) అడగాలి. సోదరీమణుల కోసం మాట్లాడటం అత్యాశ అయితే, నాకు ఈ దురాశ ఉంది. అది మంచిదే. నా దురాశ దేశానికి ఒలింపిక్ పతకాన్ని తీసుకురావడంపై దృష్టి పెట్టింది. దీన్ని సానుకూలంగానే భావిస్తున్నా." అని పేర్కొంది.

అలానే, "సాక్షి మాటలు ఆమె వ్యక్తిగత అభిప్రాయం. ఆ మాటలను అంగీకరించను. నేను బలహీనంగా ఉంటే తప్ప, పోరాటం బలహీనం కాదు. అది నా నమ్మకం. సాక్షి, వినేశ్‌, బజరంగ్ పునియా బతికున్నంతకాలం, ఆ పోరాటం బలహీనపడదు. గెలవాలని అనుకునేవారు ఎప్పటికీ బలహీనులు కాకూడదు. వారు పోరాటాన్నే ఎంచుకోవాలి. ఆ క్రమంలో ఎన్నో అడ్డంకులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకు మేం సిద్ధంగా ఉన్నాం" అని వినేశ్‌ తెలిపింది.

  • వివాదం ఎక్కడ మొదలైంది?
    బజరంగ్, వినేశ్‌ ఆసియా క్రీడల ట్రయల్స్ నుంచి మినహాయింపు అంగీకరించగా, సాక్షి మాలిక్ అటువంటి సాయాన్ని పొందకూడదని నిర్ణయించుకుంది. చివరికి సాక్షి పోటీ చేయలేదు. వినేశ్‌ గాయం కారణంగా వైదొలిగింది. బజరంగ్ పునియా 2023 హాంగ్‌జౌలో జరిగిన ఆసియా క్రీడల్లో పతకాన్ని గెలవలేకపోయాడు.

WFI అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు ఢిల్లీ కోర్టులో విచారణలో ఉంది.

ABOUT THE AUTHOR

...view details