తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోహ్లీపై విజయ్ మాల్యా కామెంట్స్- ఆటాడేసుకున్న ఫ్యాన్స్! - Virat Vijay Mallya - VIRAT VIJAY MALLYA

Virat Vijay Mallya: ఐపీఎల్‌ 2024లో ఈ రోజు ఆర్సీబీ, ఆర్‌ఆర్‌ ఎలిమినేటర్‌ ఆడుతున్నాయి. టైటిల్‌ రేసులో ఉండాలంటే ఈ మ్యాచ్‌ తప్పక గెలవాలి. వరుసగా ఆరు విజయాలతో ప్లేఆఫ్స్‌కి చేరిన ఆర్సీబీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సమయంలో ఆర్సీబీ, కోహ్లీపై విజయ్‌ మాల్యా చేసిన ట్వీట్‌ వైరల్ అవుతోంది.

Virat Vijay Mallya
Virat Vijay Mallya (Source: Getty Images)

By ETV Bharat Telugu Team

Published : May 22, 2024, 6:45 PM IST

Virat Vijay Mallya:ఐపీఎల్‌ ట్రోఫీ కోసం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు 16 సీజన్లుగా ఎదురుచూస్తోంది. ఈ సీజన్‌లో కప్పు గెలవడానికి మూడు మ్యాచ్‌ల దూరంలో ఉంది. ఈ క్రమంలో ఐపీఎల్ ప్రారంభ సీజన్ మెగా వేలంలో విరాట్ కోహ్లీకి బిడ్‌ వేయడం కంటే మెరుగైన నిర్ణయాలు తీసుకోలేనని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మాజీ ఓనర్‌ విజయ్ మాల్యా బుధవారం పేర్కొన్నారు. ప్రస్తుత సీజన్‌లో కోహ్లి అద్భుతంగా రాణిస్తున్నాడని ప్రశంసించారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ రోజు మే 22న బుధవారం జరుగుతున్న ఎలిమినేటర్‌కి ఆర్సీబీ సిద్ధమైంది. రాజస్థాన్ రాయల్స్‌తో చావోరేవో తేల్చుకోనుంది.

యునైటెడ్ కింగ్‌డమ్‌లో నివసిస్తున్న మాల్యా బుధవారం సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఎక్స్‌(గతంలో ట్విట్టర్‌)లో ఓ ట్వీట్‌ చేశాడు. 'నేను RCB ఫ్రాంచైజీ కోసం బిడ్‌ వేసినప్పుడు, విరాట్ కోసం బిడ్‌ వేసినప్పుడు, అంతకంటే బెటర్‌ ఛాయిస్‌ ఎంచుకోలేనని నా మనసు నాకు చెప్పింది' అని పేర్కొన్నాడు.

మాల్యా ట్వీట్‌కి నెటిజన్ల రియాక్షన్‌ ఎలా ఉందంటే?
కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు సంబంధించిన రూ.9,000 కోట్లకు పైగా బ్యాంకు రుణం ఎగ్గొట్టినట్లు మాల్యాపై ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. అతను 2016 మార్చి నుంచి యూకేలో నివసిస్తున్నాడు. అదే సంవత్సరం అతనిపై చట్టపరమైన చర్యల కారణంగా RCB యాజమాన్యాన్ని వదులుకోవలసి వచ్చింది.

అయితే RCB, విరాట్ కోహ్లీకి సంబంధించి మాల్యా చేసిన పోస్ట్‌ను ఇంటర్నెట్‌లో ట్రోల్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున కామెంట్స్‌ పోస్ట్‌ చేస్తున్నారు. 'SBI గురించి మీ అంతరంగం మీకు ఏమి చెప్పింది?' అని ఓ సోషల్ మీడియా యూజర్ మాల్యాని ప్రశ్నించాడు. మరో యూజర్‌ '4 సంవత్సరాలలో మొదటిసారి, నాన్‌ హాలిడే రోజు మీ ట్వీట్ వచ్చింది. IPL ప్రైజ్ మనీతో మీ లోన్‌ తీర్చడం గురించి మనం ఆలోచించవచ్చు, 'కమ్ బ్యాక్ చిచామిస్ యు' అని పేర్కొన్నాడు.

కోహ్లీ కీలక పాత్ర
ఐపీఎల్‌ 2024లో మొదటి ఎనిమిది మ్యాచుల్లో ఆర్సీబీ 7 గేమ్‌లు ఓడిపోయింది. తర్వాత వరుసగా ఆరు విజయాలు అందుకుని ప్లేఆఫ్స్‌లో అడుగు పెట్టింది. ఆర్సీబీ స్ట్రాంగ్‌ కమ్‌బ్యాక్‌లో స్టార్‌ బ్యాటర్‌ కోహ్లి పాత్ర కీలకం. కోహ్లి అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆర్సీబీకి విజయాలు అందిస్తున్నాడు. 14 ఇన్నింగ్స్‌లలో ఏకంగా 708 పరుగులు చేశాడు. అత్యధిక పరుగుల జాబితాలో టాప్‌ పొజిషన్‌లో ఉన్నాడు.

'T20ల్లోంచి విరాట్​ను తప్పించడమే వాళ్ల పని!' - T20 World Cup

కోహ్లీ భద్రతకు ముప్పు- స్టేడియం వద్ద ఉగ్రవాదులు అరెస్ట్​- RCB ప్రాక్టీస్ క్యాన్సిల్! - IPL 2024

ABOUT THE AUTHOR

...view details