Unique Spin In Kuwait Cricket Match :సాధారణంగా బౌలర్లు తమ ప్రత్యర్థులను హడలెత్తించేందుకు వారిపై ఎన్నో ట్రిక్స్‌ను ప్రయోగిస్తారు. ముఖ్యంగా స్పిన్నర్లు ఇటువంటి ఎక్స్పరిమెంట్లు చేసి పలు మార్లు వైరలయ్యారు. తాజాగా ఓ స్పిన్ బౌలర్ కూడా చాలా డిఫరెంట్‌గా బంతిని స్పిన్ చేసి ఎదుట ఉన్న బ్యాటర్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీన్ని చూసి స్టేడియంలో ఉన్న వారు షాకయ్యారు.
ఇంతకీ ఏం జరిగిందంటే ?
కువైట్ జెర్సీ ధరించిన ఓ బౌలర్ తమ ఆపోజిట్ టీమ్ ప్లేయర్‌ను కన్ఫ్యూజ్ చేసేందుకు విన్నూత్న రీతిలో ఆఫ్ స్పిన్ వేశాడు. అయితే ఆ బంతి ఫుల్‌టాస్ అయ్యి ఆఫ్ స్టంప్ ఆవల పడింది. అలా లెగ్ స్టంప్‌ను గిరాటు వేసింది. అయితే బంతి స్పిన్ అయిన విధానం చూసిన బ్యాటర్ ఒక్క సారిగా షాకయ్యాడు. దాన్ని ఎలా ఆడాలో తెలియక తికమక పడి ఔటయ్యాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. ఇక ఈ వీడియో పై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. కొందరేమో దీన్ని బాల్ ఆఫ్ ది సెంచరీగా అభివర్ణిస్తున్నారు. బౌలర్ టైమింగ్ స్కిల్‌ను కొనియాడుతున్నారు.
క్లియర్ రనౌట్- అయినా నాటౌట్
Run Out Controversy Joseph:ఆస్ట్రేలియా- వెస్టిండీస్ టీ20 మ్యాచ్‌లో క్రికెట్ చరిత్రలో ఓ అనూహ్యమైన సంఘటన జరిగింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇరుజట్ల మధ్య ఫిబ్రవరి 11న రెండో టీ20 జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ నిర్దేశించిన 242 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో విండీస్ 207 పరుగులకే పరిమితమైంది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో విండీస్ ప్లేయర్ అల్జారీ జోసెఫ్ రనౌట్ కాంట్రవర్సీకి దారి తీసింది.