తెలంగాణ

telangana

ETV Bharat / sports

అండర్‌19 ప్రపంచకప్‌ - భారత్‌ ఘన విజయం

Under - 19 World Cup : అండర్‌ 19 ప్రపంచకప్‌లో భాగంగా యూఎస్‌ఏతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ భారీ విజయాన్ని అందుకుంది. ప్రత్యర్థి జట్టుపై 201 పరుగుల భారీ తేడాతో గెలుపును ఖాతాలో వేసుకుంది. మొదట టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్​కు దిగిన టీమ్‌ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 326 పరుగులు చేసింది. అర్శిన్‌ కులకర్ణి(108) సెంచరీతో, ముషీర్‌ ఖాన్‌ (73) హాఫ్​ సెంచరీతో అదరగొట్టారు. లక్ష్యఛేదనకు దిగిన యూఎస్‌ఏ 50 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 125 పరుగులు మాత్రమే చేసింది. భారత బౌలర్లలో నమన్‌ తివారీ 4 వికెట్లు తీయగా రాజ్‌ లంబానీ, ప్రియాంన్షు మొలియా, సౌమీ పాండే, మురుగన్‌ అభిషేక్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Telugu Team

Published : Jan 28, 2024, 9:13 PM IST

Updated : Jan 28, 2024, 9:37 PM IST

Under - 19 World Cup : అండర్‌ 19 ప్రపంచ కప్‌లో యంగ్ టీమ్​ ఇండియా హ్యాట్రిక్ నమోదు చేసింది. గ్రూప్ స్టేజ్​లో యూఎస్‌ఏతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ భారీ విజయాన్ని అందుకుంది. ప్రత్యర్థి జట్టుపై 201 పరుగుల భారీ తేడాతో గెలుపును ఖాతాలో వేసుకుంది.

మొదట టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్​కు దిగిన టీమ్‌ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 326 పరుగులు చేసింది. అర్శిన్‌ కులకర్ణి(108) సెంచరీతో, ముషీర్‌ ఖాన్‌ (73) హాఫ్​ సెంచరీతో అదరగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన యూఎస్‌ఏ 50 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 125 పరుగులు మాత్రమే చేసింది. ఉత్కర్ష్‌ శ్రీవాత్సవ (40) ఫర్వాలేదనిపించగా, ఆమోఘ్ ఆరేపల్లి (27*), ఆరిన్‌ నడక్కర్ణి (20) కాస్త పోరాడారు. దీంతో ఓటమి అంతరం కాస్త తగ్గింది. భారత బౌలర్లలో నమన్‌ తివారీ 4 వికెట్లు తీయగా రాజ్‌ లంబానీ, ప్రియాంన్షు మొలియా, సౌమీ పాండే, మురుగన్‌ అభిషేక్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు. ఇకపోతే మంగళవారం నుంచి సూపర్ సిక్స్‌ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి.

రెండో వికెట్‌కు భారీ భాగస్వామ్యం : యూఎస్‌ఏ జట్టుపై భారత్‌ బ్యాటర్లు అదిరే ప్రదర్శన చేశారు. ఓపెనర్‌ ఆదర్శ్‌ సింగ్‌ (25)తో అర్షిన్‌ కులకర్ణి మొదటి వికెట్‌కు 46 పరుగులు నమోదు చేశాడు. ఆదర్శ్‌ ఔట్​ అయిన తర్వాత క్రీజ్‌లోకి వచ్చాడు ముషీర్‌ ఖాన్‌. ఇతడితో కలిసి అర్షిన్‌ రెండో వికెట్‌కు 155 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ముషీర్‌ ఔట్ అయినప్పటికీ కెప్టెన్‌ ఉదయ్ సహరన్ (35)తో అర్షిన్‌ మరో 56 పరుగులు జోడిండి స్కోరు బోర్డును పరుగెత్తించాడు. ఈ క్రమంలో అర్షిన్‌ సెంచరీ పూర్తి చేశాడు. అయితే యూఎస్‌ఏ బౌలర్లు పుంజుకోవడం వల్ల స్వల్ప వ్యవధిలో టీమ్​ఇండియా వికెట్లను చేజార్చుకుంది. ప్రియాన్షు మోలియా 27, సచిన్‌ ధాస్ 20, ఆరవెల్లి అవనీశ్‌ 12* పరుగులు మాత్రమే చేశారు. యూఎస్‌ఏ బౌలర్లు అతీంద్ర సుబ్రమణియన్‌ 2 వికెట్లు తీయగా ఆరిన్‌ నడ్కరి, ఆర్య గార్గ్‌, రిషి రమేశ్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

లంక క్రికెట్‌ బోర్డుపై నిషేధం ఎత్తివేత

ఉప్పల్​ టెస్ట్​లో భారత్ ఓటమి - 7 వికెట్లతో చెలరేగిన ఇంగ్లాండ్​ స్పిన్నర్​

Last Updated : Jan 28, 2024, 9:37 PM IST

ABOUT THE AUTHOR

...view details