Top Test Bowlers In 2024 : 2024వ ఏడాది దాదాపు రెండు వారాల్లో ముగియనుంది. ఈ ఏడాదిలో క్రికెట్, ఫ్యాన్స్‌కి అద్భుతమైన ఎంటర్‌టైన్‌మెంట్ అందించింది. ముఖ్యంగా ఏడాది చివరిలో జరుగుతున్న కొన్ని సిరీస్‌లు అభిమానులకు అసలైన టెస్ట్ మ్యాచ్‌ల మజాను పరిచయం చేస్తున్నాయి. కొందరు బౌలర్లు టెస్ట్ మ్యాచుల్లో సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.
టీమ్‌ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా టాప్ బౌలర్ ఆఫ్ ది ఇయర్‌గా అవతరించాడు. ఈ ఏడాది అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. 2024లో టెస్ట్ క్రికెట్‌లో ఆధిపత్యం చెలాయించిన టాప్ 10 బౌలర్ల ఎవరో ఇప్పుడు చూద్దాం.
జోష్ హేజిల్‌వుడ్ (ఆస్ట్రేలియా)
ఆస్ట్రేలియన్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ పదో స్థానంలో నిలిచాడు. ఈ ఏడాది గాయాలతో ఇబ్బంది పడిన అతడు, కేవలం 7 మ్యాచుల్లో 13.60 యావరేజ్‌తో 35 వికెట్లు పడగొట్టాడు.
విలియం పీటర్ ఓ'రూర్కే (న్యూజిలాండ్)
న్యూజిలాండ్‌కు చెందిన రైట్ ఆర్మ్ పేసర్ విలియం పీటర్ ఓ రూర్క్ 10 మ్యాచుల్లో 24.80 యావరేజ్‌తో 36 వికెట్లు సాధించాడు. జాబితాలో తొమ్మిదో స్థానంలో ఉన్నాడు.
అసిత ఫెర్నాండో (శ్రీలంక)
శ్రీలంక ఫాస్ట్ బౌలర్ అసిత ఫెర్నాండో కేవలం 9 మ్యాచుల్లోనే 37 వికెట్లు తీశాడు. ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. అతడి అత్యుత్తమ గణాంకాలు 5/102.
రవీంద్ర జడేజా (భారత్)
మరో భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా 11 మ్యాచుల్లో 44 వికెట్లు పడగొట్టాడు. జాబితాలో ఏడో బౌలర్‌గా నిలిచాడు.
రవిచంద్రన్ అశ్విన్ (భారత్)
తాజాగా అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసందే. అశ్విన్ ఈ లిస్టులో ఆరో స్థానంలో నిలిచాడు. 11 మ్యాచుల్లో 47 వికెట్లు పడగొట్టాడు. అతడి అత్యుత్తమ గణాంకాలు 6/88.