తెలంగాణ

telangana

ETV Bharat / sports

రోహిత్​కు శుభాకాంక్షల వెల్లువ- ఎమోషనలైన తిలక్ వర్మ! - ROHIT SHARMA SECOND BABY

రోహిత్​కు శుభాకాంక్షల వెల్లువ- ఎమోషనలైన తిలక్ వర్మ!

Tilak Rohit
Tilak Rohit (Source : AP (Left), IANS (Right))

By ETV Bharat Sports Team

Published : Nov 16, 2024, 5:42 PM IST

Rohit Sharma Second Baby :టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి తండ్రైన సందర్భంగా అతడికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజూ శాంసన్ హిట్​మ్యాన్​కు స్పెషల్ విషెష్ తెలిపారు. ఈ ముగ్గురు మాట్లాడిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

'చాలా హ్యాపీ'
రోహిత్​కు కుమారుడు పుట్టడం పట్ల తిలక్ వర్మ సంతోషం వ్యక్తం చేశాడు. హిట్​మ్యాన్​కు విషెస్ తెలుపుతూ కాస్త ఎమోషనల్ అయ్యాడు. 'నేను చాలా సంతోషంగా ఉన్నాను రోహిత్ భాయ్. ఈ క్షణం కోసమే ఎదురుచూశాం. ఒకటి, రెండు రోజుల తర్వాత డెలివరీ అయ్యుంటే నేను పక్కనే ఉండేవాడిని. చాలా ఎగ్జైటింగ్​గా ఉన్నాను. తొందరగానే వచ్చి కలుస్తాను' అని తిలక్ వర్మ పేర్కొన్నాడు. 'లిటిల్ బాయ్ కోసం చిన్న ప్యాడ్లు, సైడ్ ఆర్మ్, బ్యాట్​తో సిద్ధంగా ఉండాలి' అని రోహిత్ కు సూర్యకుమార్ యాదవ్ స్పెషల్ విషెష్ చెప్పాడు. 'చెట్టా (అన్నయ్య), అతని కుటుంబం చాలా సంతోషంగా ఉండాలి' అని రోహిత్‌కు శాంసన్ శుభాకాంక్షలు తెలియజేశాడు.

రోహిత్‌ శర్మ మరోసారి తండ్రి అయ్యాడు. అతడికి రెండో సంతానం కలిగింది. హిట్ మ్యాన్ భార్య రితికా సజ్దే శుక్రవారం రాత్రి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో రోహిత్ శర్మ కుటుంబంలో సంబరాలు మొదలయ్యాయి. అయితే ఈ జంటకు ఇప్పటికే ఓ కుమార్తె ఉంది.

తొలి టెస్టులో ఆడే ఛాన్స్!
కాగా, భార్య రితికా డెలివరీ అవ్వడం వల్ల అతడు ఈ నెల 22న ప్రారంభమయ్యే బోర్డర్‌ - గావస్కర్‌ ట్రోఫీ తొలి టెస్టుకు అందుబాటులో ఉండే ఛాన్స్ ఉంది.

బోర్డర్ గావస్కర్ ట్రోఫీకి భారత్ జట్టు :రోహిత్ శర్మ (కెప్టెన్), జస్‌ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్‌ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, సర్ఫరాజ్‌ ఖాన్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, సిరాజ్, ఆకాశ్‌ దీప్, ప్రసిధ్‌ కృష్ణ, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.. రిజర్వ్: ముకేశ్‌ కుమార్, నవ్‌దీప్‌ సైని, ఖలీల్ అహ్మద్

రెండోసారి తండ్రైన రోహిత్ శర్మ - మగబిడ్డకు జన్మనిచ్చిన రితికా సజ్దే

'మేం నలుగురమయ్యాం' : గుడ్​న్యూస్ షేర్ చేసుకున్న హిట్​మ్యాన్

ABOUT THE AUTHOR

...view details