Test Matches Abandoned:న్యూజిలాండ్ - అఫ్గానిస్థాన్ మధ్య జరగాల్సిన ఏకైక టెస్టు మ్యాచ్ టాస్ పడకుండానే వరుసగా నాలుగో రోజు ఆట కూడా రద్దైంది. గ్రేటర్ నోయిడా స్పోర్ట్స్ మైదానంలో జరగాల్సిన ఈ మ్యాచ్‌కు తొలి నుంచే వర్షం తీవ్ర అంతరాయం కలిగించింది. దీంతో మైదానం ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది. తొలి మూడు రోజుల్లో మాదిరిగానే ఈ రోజు కూడా ఉదయం అంపైర్లు మైదానాన్ని పరిశీంచారు.
అయితే ఆట నిర్వహించేందుకు ఏ మాత్రం అవకాశం లేకపోవడం వల్ల నాలుగో రోజు ఆటను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. సెప్టెంబర్ 9న ప్రారంభం కావాల్సిన మ్యాచ్‌లో ఇప్పటివరకు టాస్ కూడా పడలేదు. మైదానం మొత్తం కవర్లతో కప్పి ఉంచారు. ఇక చివరి రోజైన శుక్రవారం మరోసారి గ్రౌండ్‌ను పరిశీలించి మ్యాచ్ నిర్వహణపై ఓ నిర్ణయం తీసుకుంటారు.
అయితే ఎంతో చరిత్ర ఉన్న టెస్టు ఫార్మాట్ క్రికెట్లో ఒక్క బంతి కూడా పడకుండా మ్యాచ్ రద్దైన సందర్భాలు ఎన్నో తెలుసా? ఇప్పటివరకు పలు కారణాల వల్ల 7 టెస్టు మ్యాచ్‌లు ఒక్క బంతి కూడా పడకుండా రద్దు అయ్యాయి. అందులో అత్యధికంగా 3 మ్యాచ్‌లు ఆసీస్- ఇంగ్లాండ్ ప్రతిష్ఠాత్మకమైన యాషెస్ సిరీస్లోనివే. ఇవే కాకుండా న్యూజిలాండ్- భారత్, న్యూజిలాండ్- పాకిస్థాన్, ఇంగ్లాండ్- వెస్టిండీస్, పాకిస్థాన్- జింబాబ్వే మ్యాచ్‌లు రద్దయ్యాయి. అయితే ఇందులో పలు సందర్భాల్లో టెస్టు మ్యాచ్ కాస్త వన్డే ఫార్మాట్లో నిర్వహించారు.
నెం | సంవత్సరం | మ్యాచ్ | వేదిక | ఫలితం |
1 | 5-08-1890 | ఆస్ట్రేలియా - ఇంగ్లాండ్ | మాంచెస్టర్ | మ్యాచ్ రద్దు |
2 | 08-07-1938 | ఆస్ట్రేలియా - ఇంగ్లాండ్ | మాంచెస్టర్ | మ్యాచ్ రద్దు |
3 | 31-12-1970 | ఆస్ట్రేలియా - ఇంగ్లాండ్ | మెల్బోర్న్ | వన్డే ఫార్మాట్లోకి ఛేంజ్ |
4 | 03-02-1989 | న్యూజిలాండ్ - పాకిస్థాన్ | క్యారీస్ బ్రుూక్, డునెడిన్ | వన్డే ఫార్మాట్లోకి ఛేంజ్ |
5 | 10-03-1990 | ఇంగ్లాండ్ - వెస్టిండీస్ | జార్జిటౌన్ | వన్డే ఫార్మాట్లోకి ఛేంజ్ |
6 | 17-12-1998 | న్యూజిలాండ్ - జింబాబ్వే | ఫైసలాబాద్ | టాస్ కూడా పడలేదు |
7 | 18-12-1998 | న్యూజిలాండ్ - భారత్ | క్యారీస్ బ్రుూక్, డునెడిన్ | మ్యాచ్ రద్దు |