TeamIndia VS Zimbabwe T20 Series :జులై 6 నుంచి జింబాబ్వే వర్సెస్ ఇండియా టీ20 సిరీస్ మొదలు కానుంది. హరారేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ మొత్తం ఐదు టీ20ఐ మ్యాచ్‌లకు వేదిక కానుంది. శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో యంగ్ ఇండియా టీమ్ బరిలో దిగుతోంది. అయితే ప్రస్తుతం జింబాబ్వే అంత ప్రమాదకరంగా కనిపించడం లేదు. భారత్ సులువుగానే సిరీస్ ఛేజిక్కించుకునే అవకాశాలు ఉన్నాయి.
కానీ గతంలో జింబాబ్వే చాలా సంచలన విజయాలు సాధించింది. పెద్ద టీమ్‌లకు సైతం గట్టి పోటీ ఇచ్చింది. ఇప్పటి వరకు జింబాబ్వే- భారత్ మధ్య 8 టీ20లు జరిగితే, 6 మ్యాచుల్లో భారత్ విజయం సాధించింది. 2 జింబాబ్వే గెలిచింది. ఇప్పటి వరకు జింబాబ్వే- భారత్ టీ20 సిరీస్‌ల ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
- 2022 టీ20 ప్రపంచ కప్
టీ20 ప్రపంచ కప్ 2022లో జింబాబ్వేపై భారత్ 71 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మెల్‌బోర్న్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ మొదట 186/5 స్కోరు చేసింది. సూర్యకుమార్ యాదవ్ 25 బంతుల్లో 61 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. జింబాబ్వే 115 పరుగులకే ఆలౌటైంది. అశ్విన్ (3/22) అద్భత గణాంకాలు నమోదు చేశాడు.
- 2010లో సులువుగా గెలిచిన భారత్
2010లో సురేశ్ రైనా కెప్టెన్సీలో భారత్ జింబాబ్వేలో పర్యటించింది. మొదటి టీ20 సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు గెలిచి క్లీన్‌స్వీప్ చేసింది. టీమ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా ఉన్నారు. మొదటి టీ20లో యూసఫ్ పఠాన్ (37*), రెండో మ్యాచ్‌లో సురేశ్ రైనా (72*) రాణించారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు కెప్టెన్ అందుకున్నాడు. జింబాబ్వేపై భారత్ ఈజీగానే గెలిచింది.
- 2015లో షాక్ ఇచ్చిన జింబాబ్వే