తెలంగాణ

telangana

ETV Bharat / sports

గంభీర్ గ్యారేజీలో ఉన్న​ లగ్జరీ కార్లు ఇవే - అతడి నెట్​వర్త్​ ఎన్ని కోట్లో తెలుసా? - Gautam Gambhir Networth - GAUTAM GAMBHIR NETWORTH

TeamIndia Head Coach Gautam Gambhir Networth : టీమ్​ఇండియా హెడ్​ కోచ్‌గా గంభీర్​కు క్రికెట్​లో కొత్త అధ్యాయం మొదలైంది. అయితే చాలా మంది గంభీర్‌ను రిచెస్ట్‌ క్రికెటర్‌గా భావిస్తుంటారు. మరి ఇంతకీ అతడి నెట్‌ వర్త్‌ ఎంతో తెలుసుకుందాం.

source Getty Images
Gautam Gambhir (source Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Jul 10, 2024, 6:49 PM IST

TeamIndia Head Coach Gautam Gambhir Networth :గౌతమ్‌ గంభీర్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అటు క్రికెట్‌లో, ఇటు రాజకీయాల్లో రాణించాడు. దాదాపు పదేళ్లు జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. 2007 టీ20 వరల్డ్‌ కప్‌, 2011 వన్డే వరల్డ్‌ కప్‌ గెలిచిన జట్టులో కీలక సభ్యుడు. తూర్పు దీల్లీ నుంచి పార్లమెంటు సభ్యుడిగా కూడా పనిచేశాడు. ఇప్పుడు రాహుల్ ద్రవిడ్ తర్వాత భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. అతని పదవీ కాలం 2027 జులై వరకు కొనసాగనుంది. దీంతో ఇప్పుడంతా అతడి పేరే వినిపిస్తోంది. అయితే చాలా మంది గంభీర్‌ను రిచెస్ట్‌ క్రికెటర్‌గా భావిస్తుంటారు. మరి ఇంతకీ అతడి నెట్‌ వర్త్‌ ఎంతో తెలుసుకుందాం.

  • గౌతమ్ గంభీర్ క్రికెట్ కెరీర్
    గౌతమ్ గంభీర్ 2003 నుంచి 2016 వరకు 58 టెస్టులు, 147 వన్డేలు, 251 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 4154 పరుగులు, వన్డేల్లో 5238, టీ20 ఇంటర్నేషనల్స్(37)లో 932 పరుగులు చేశాడు. 154 ఐపీఎల్ మ్యాచుల్లో 4218 పరుగులు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 10,000 పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలోనూ చేరాడు.
  • గంభీర్ నెట్‌వర్త్‌ ఎంత?(Gambhir Net worth)
    ఇంగ్లీష్ సైట్ల కథనాల ప్రకారం గంభీర్ నెట్‌వర్త్‌ 32 మిలియన్ డాలర్లు (సుమారు రూ.265 కోట్లు)గా ఉన్నట్లు అంచనా. అతని ఆదాయ వనరుల్లో క్రికెట్, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు, బిజినెస్‌ వెంచర్లు, ఇన్వెస్ట్‌మెంట్‌లు ఉన్నాయి. గంభీర్​కు రూ.15కోట్ల విలువైన విలాసవంతమైన ఇల్లు, రూ.4కోట్లతో ఓ ప్లాట్​, కోటి రూపాయల విలువైన మరో ఫ్లాట్ ఉందట.
  • బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు
    ఎంఆర్‌ఎఫ్‌, రీబాక్‌, క్రిక్‌ప్లే వంటి ప్రముఖ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్​గా ఉంటున్నాడు. రెడ్‌క్లిఫ్ ల్యాబ్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడట. కామెంటరీ, క్రికెట్ సంబంధిత మీడియా ఎంగేజ్‌మెంట్స్‌ ద్వారా రూ.1.5 కోట్లకు పైగా సంపాదించేవాడు.
  • లగ్జరీ కార్ కలెక్షన్(Gambhir Car Collections)
    గంభీర్‌కు లగ్జరీ కార్‌లంటే ఇష్టం. అతని కార్ల కలెక్షన్‌లో ఆడి క్యూ5, బీఎండబ్ల్యూ 530డి వంటి హై-ఎండ్ మోడల్స్‌ ఉన్నాయి. ఇంకా అతడి గ్యారేజీలో మారుతి సుజుకి SX4, టయోటా కరోలా, మహీంద్రా బొలెరో స్టింగర్ కూడా ఉన్నాయి.



    సపోర్టింగ్ స్టాఫ్​పై గంభీర్ ఫోకస్- కొత్త బ్యాటింగ్ కోచ్​గా సీనియర్! - Team India Batting Coach

ABOUT THE AUTHOR

...view details