WTC 2025 Team India : కాన్పూర్ వేదికగా, తాజగా బంగ్లదేశ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్లోటీమ్ఇండియా మరోసారి అదరగొట్టింది. 2-0 పాయింట్లతో ఈ రెండు టెస్టుల సిరీస్‌ను రోహిత్ సేన క్లీన్‌స్వీప్ చేసింది. అయితే రెండో టెస్టు డ్రా అవుతుందని అనిపించినప్పటికీ, అదిరే ఆట తీరుతో మ్యాచ్‌ను ఏకపక్షం చేసేసి భారత జట్టు ఈ మ్యాచ్‌లో విజయాన్ని నమోదు చేసింది.
ఇదిలా ఉండగా, ఈ సిరీస్ విజయంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టీమ్‌ఇండియా తమ అగ్రస్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. అంతేకాకుండా వరుసగా మూడోసారి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్(డబ్ల్యూటీసీ)కు దూసుకెళ్లడానికి తన దారిని మరింత సులువుగా ఏర్పరుచుకుంది.
అయితే డబ్ల్యూటీసీలో భారత్ ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడింది. అందులో 8 విజయాలు, 2 ఓటములు, ఒక డ్రా ఉన్నాయి. ప్రస్తుతం భారత జట్టు (PCT 74.27)తో టాప్ పొజిషన్లో ఉంది.
ఆ మూడింటిలో గెలిస్తే చాలు
మరోవైపుజూన్‌లో జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్ కంటే ముందు టీమ్‌ఇండియా ఎనిమిది టెస్టులు ఆడనుంది. వాటిలో మూడింట గెలిచినా కూడా ఇతర జట్ల ఫలితాలతో సంబంధం లేకుండానే భారత జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది.
అక్టోబర్ 16 నుంచి న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్, అలాగే నవంబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా బోర్డర్-గావస్కర్ ట్రోఫీ (ఐదు టెస్టులు) ప్రారంభంకానున్నాయి. స్వదేశంలో కివీస్‌తో జరిగే సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేస్తే మాత్రం ఆస్ట్రేలియా సిరీస్‌తో సంబంధం లేకుండానే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుతుంది.అయితే స్వదేశంలో టీమ్‌ఇండియాను ఓడించడం ఏ జట్టుకైనా కష్టం.
ఇదిలా ఉండగా, ప్రస్తుతం కివీస్ జట్టు పరిస్థితి ప్రస్తుతం బాగోలేదని క్రికెట్ విశ్లేషకుల మాట. శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లోనూ ఆ జట్టు చిత్తుగా ఓడింది. గెలుపు సంగతి పక్కనపెడితే కనీసం ఒక్క మ్యాచ్‌ను కూడా డ్రాగా ముగించలేదన్నది వారి విశ్లేషణ.
ఇక రెండు రోజుల పాటు వర్షం కారణంగా ఆగిన మ్యాచ్ ఆఖరి రోజు చాలా రసవత్తరంగా సాగింది. తొలి రోజు కేవలం 35 ఓవర్లే పడి భారత్ గెలుపు కష్టమనుకునున్న సమయంలో బంగ్లాను రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఆలౌట్ చేసింది రోహిత్ సేన. కేవలం 95 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్‌ఇండియా మూడు వికెట్లను మాత్రమే కోల్పోయి విజయం సాధించింది.
బంగ్లాతో టెస్టు సిరీస్ క్లీన్‌స్వీప్ -7 వికెట్ల తేడాతో రోహిత్ సేన ఘన విజయం - India Vs Bangladesh Test
భారత్ ఫాస్టెస్ట్ 50 రికార్డు- టెస్టుల్లో ఇలా హాఫ్ సెంచరీ, శతకం చేసిన ప్లేయర్స్ ఎవరంటే? - Fastest 50 and 100 in Test Format