7 సిరీస్‌లు, 24మ్యాచ్‌లు- ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు బిజీ బిజీగా టీమ్ఇండియా- షెడ్యూల్ ఇదే - Team India Schedule 2024 25 - TEAM INDIA SCHEDULE 2024 25
Team India Schedule 2024- 25: శ్రీలంక సిరీస్ తర్వాత ఇండియాకి కాస్త విశ్రాంతి లభించింది. అనంతరం 2025 ఐపీఎల్ వరకు భారత్ తీరిక లేకుండా క్రికెట్ ఆడనుంది. షెడ్యూల్ ఎలా ఉందంటే?
Team India Schedule 2024 (Associated Press (Team India), Getty Images)
Team India Schedule 2024- 25:టీమ్‌ఇండియా కొత్త కోచ్ గంభీర్ నేతృత్వంలో మిశ్రమ ఫలితాలు అందుకుంది. ఇటీవల ముగిసిన శ్రీలంక పర్యటనలో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీ20 సిరీస్‌ని క్లీన్ స్వీప్ చేసింది. అయితే వన్డేల్లో మాత్రం ఇండియాకి ఘోర పరాజయం ఎదురైంది. కెప్టెన్ రోహిత్ ఆధ్వర్యంలో భారత్ 2-0 తో వన్డే సిరీస్ కోల్పోయింది. బిజీ పీరియడ్ తర్వాత భారత జట్టుకి ఇప్పుడు కాస్త బ్రేక్ లభించింది. వచ్చే నెల స్వదేశంలో బంగ్లాదేశ్‌తో మొదలయ్యే టెస్ట్ సిరీస్‌తో భారత్ మళ్లీ బరిలో దిగనుంది. అయితే 2025 ఐపీఎల్ వరకు ఇండియా క్రికెట్ షెడ్యూల్ ఎలా ఉంది? ఎక్కడ ఆడుతుంది? ఇప్పుడు తెలుసుకుందాం.
బంగ్లాదేశ్ సిరీస్ (భారత్) సెప్టెంబర్- అక్టోబర్
తొలి టెస్టు
సెప్టెంబర్ 19
చెన్నై
రెండో టెస్టు
సెప్టెంబర్ 27
కాన్పూర్
తొలి టీ20
అక్టోబర్ 6
ధర్మశాల
రెండో టీ20
అక్టోబర్ 9
దిల్లీ
మూడో టీ20
అక్టోబర్ 12
హైదరాబాద్
న్యూజిలాండ్ సిరీస్ (భారత్) అక్టోబర్- నవంబర్
తొలి టెస్టు
అక్టోబర్ 16
బెంగళూరు
రెండో టెస్టు
నవంబర్ 1
పూణె
సౌతాఫ్రికా సిరీస్ (సౌతాఫ్రికా)
తొలి టీ20
నవంబర్ 08
డర్బన్
రెండో టీ20
నవంబర్ 10
కేప్‌టౌన్
మూడో టీ20
నవంబర్ 13
సెంచూరియన్
నాలుగో టీ20
నవంబర్ 15
జోహన్నెస్‌బర్గ్
బోర్డర్-గావస్కర్ ట్రోఫీ (ఆస్ట్రేలియా) 2024-25
తొలి టెస్టు
నవంబర్ 22
పెర్త్
రెండో టెస్టు
డిసెంబర్ 6
అడిలైడ్
మూడో టెస్టు
డిసెంబర్ 14
బ్రిస్బేన్
నాలుగో టెస్టు
డిసెంబర్ 26
మెల్‌బోర్న్
ఐదో టెస్టు
జనవరి 03
సిడ్నీ
ఇంగ్లాండ్ సిరీస్ (భారత్) జనవరి- ఫిబ్రవరి
భారత్ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లాండ్‌తో సిరీస్ ఆడనుంది. ఇంగ్లాండ్ ఈ సిరీస్ కోసం భారత్‌లో పర్యటిస్తుంది. ఈ ద్వైపాక్షిక సిరీస్‌లో 5 టీ20, 3వన్డేలు జరగనున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ సన్నాహాల్లో భాగంగా ఇరుజట్లకు ఈ సిరీస్ కీలకం కానుంది.
తొలి టీ20
జనవరి 22
చెన్నై
రెండో టీ20
జనవరి 25
కోల్‌కతా
మూడో టీ20
జనవరి 28
రాజ్‌కోట్
నాలుగో టీ20
జనవరి 31
పుణె
ఐదో టీ20
ఫిబ్రవరి 02
ముంబయి
తొలి వన్డే
ఫిబ్రవరి 06
నాగ్‌పూర్
రెండో వన్డే
ఫిబ్రవరి 09
కటక్
మూడో వన్డే
ఫిబ్రవరి 12
అహ్మదాబాద్
Duleep Trophy 2024:బంగ్లాదేశ్ సిరీస్ కంటే ముందు ఆడనున్న దులీప్ ట్రోఫీ జట్లను బీసీసీఐ బుధవారం ప్రకటించింది. నాలుగు జోన్లకు యంగ్ ప్లేయర్లే కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. అయితే టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా దులీప్ ట్రోఫీ ఆడుతారని ముందుగా ప్రచారం సాగింది. కానీ వీళ్లద్దరు డొమెస్టిక్‌కు మరోసారి దూరంగా ఉన్నారు. సెప్టెంబరు 5 నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానుంది.